తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎస్) మరింత పారదర్శకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి కీలక అడుగు వేసింది. భద్రతా ప్రమాణాలు, డిజిటల్ సదుపాయాలతో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయాలకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి పంపిణీ తేదీలు, తుది మార్గదర్శకాలు విడుదలైన వెంటనే లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు.