తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->తెలంగాణ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఎన్నికల మున్సిపల్ వేళ మూడు ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ ఎన్నికలు ఈ మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అందరికంటే సీఎం రేవంత్ కు మున్సిపల్ ఫలితాలు సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. కాగా, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. దీనికి సంబంధించి దాదాపు ముహూర్తం ఖరారైంది. మున్సిపల్ ఫలితాల తరువాత అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం.
తెలంగాణలో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఇందు కోసం అధికార కాంగ్రెస్ సిద్దం అవుతోంది. మున్సిపల్ పోరు వెంటనే ఈ ఉప ఎన్నిక దిశగా వేగంగా జరిగే అవకాశం ఉంది. పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గులాబీ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో పది మందిని విచారించిన స్పీకర్ ఎనిమిది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. మరో ఇద్దరు నేతల విషయంలో మాత్రమే విచారణ పెండింగ్‌లో ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలను విచారించారు. వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఆయన పైన వేటు తప్పదనే చర్చ కొనసాగుతోంది. దీంతో, దానం నాగేందర్‌తో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లే ఆలోచన ఖరారైనట్లు తెలుస్తోంది.

మున్సిపల్ ఫలితాల తరువాత నిర్ణయం
ఈ విషయంలో స్పీకర్ తుది నిర్ణయం కీలకం. ఇప్పటికే సుప్రీం సైతం పెండింగ్ అనర్హత పిటీషన్ల పైన నిర్ణయం తీసుకోవడానికి సూచన చేసింది. మరో మూడు వారాలు గడువుగా నిర్దేశించింది. ఆ గడువు ఈ నెల మూడోవారానికి పూర్తి. మరో వైపు రేపు (బుధ రం) జరిగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 13వ తేదీన విడుదల కానున్నాయి. దీని తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. దానం నాగేందర్ తో పాటు కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉంది. 2023 ఎన్నికల తర్వాత వరసగా హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్, జూబ్లీల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. మున్సిపల్ ఫలితాలకు అనుగుణంగా ఉప ఎన్నిక పైన తుది నిర్ణయం ఖాయంగా నిర్ణయించబడింది.
ఆంగ్ల సారాంశం
రాజకీయ వర్గాల్లో ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యం, ఈ నెల చివరి వారంలో ప్రకటించే అవకాశాలు