Saturday, March 14, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణలో పెరుగుతున్న కల్తీ ఫుడ్.. కవిత ట్వీట్.. | telangana Food Crisis Exposed: telangana...

తెలంగాణలో పెరుగుతున్న కల్తీ ఫుడ్.. కవిత ట్వీట్.. | telangana Food Crisis Exposed: telangana jagruthi Kavitha Raises Alarm OverWidespread కల్తీ

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

తెలంగాణలో విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, కల్తీ పెరుగు గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. గడచిన మూడేళ్లలో 14,312 ఫుడ్ శాంపిల్స్ ను టెస్టింగ్ చేయగా కేవలం 16 లైసెన్సులు మాత్రమే రద్దు చేసినట్లు సమాచారం. అలాగే జీరో క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు.

అయితే ఇదే విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ట్వీట్ చేశారు. కల్తీ నిర్వాహకులను పట్టుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని అన్నారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రపు తనిఖీలు తెలిపారు. నిందితులను శిక్షించడంలో విఫలం అవుతున్నారని ట్వీట్ చేశారు.

తెలంగాణ ఆహార సంక్షోభం బహిర్గతమైన telangana jagruthi Kavitha Raises Alarm OverWidespread కల్తీ

ప్రభుత్వ డేటా ప్రకారం ఫుడ్ శాంపిల్‌లు దాదాపు 46 శాతం తగ్గినట్లు తెలిపారు. అలాగే సివిల్ కేసులు కూడా 71 శాతం తగ్గిపోయినట్లు కవిత స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా క్రిమినల్ కేసు నమోదు చేయలేదని తెలిపారు. కేవల ఒకే లైసెన్స్ ను రద్దు చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంపై పోరాడకపోవడం దురదృష్టకరమని అన్నారు.

ఈ మేరకు ఇటీవల పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ తీరును రాతపూర్వకంగా తెలియజేసింది. ఈ విషయాలను తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఇక శిక్షలను రద్దు చేయడంలో, లైసెన్స్ చేయడంలో తెలంగాణ రాష్ట్రంతో తాజా కర్ణాటక, కేరళ, ఏపీ ఇతర రాష్ట్రాలు చాలా ముందున్నట్లు నివేదికలు అందజేస్తున్నాయి. ఇక ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే కల్తీకి జైలు శిక్షలు పడేలా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular