seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 8:50 am Digital Edition : SEEMA KIRANAM

తిరుమల శ్రీవారి ఆలయంలో అరుదైన ఘట్టం- దర్శనంపై భక్తులకు కీలక సూచనలు..!! | రాబోయే ముఖ్యమైన పండుగల తరువాత మార్చి నెలలో మూడు ఆస్థానాలను నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఈ నెలలో వరుస పర్వదినాల వేళ అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. అందులో భాగంగా మూడు వరుస స్థానాలు నిర్వహించాలని నిర్ణయించారు. దర్శనాల పైన భక్తులకు కీలక అప్డేట్ ఇచ్చారు. మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17వ తేదీ మంగళ వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది.

తిరుమలలో ఉగాది వేళ ఆస్తానం నిర్వహించనున్నారు. అందులో భాగంగా ముందుగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ స్పష్టం చేసింది. అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. ఈ కారణంగా మార్చి 18వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించారు.

వచ్చే-ముఖ్యమైన-పండుగలను అనుసరించి-మార్చి-నెలలో-మూడు-ఆస్థానాలను-టిటిడి-నిర్వహించడానికి-

వరుసగా మూడు స్థానాలు

కాగా.. ఉగాది ఆస్థానం (మార్చి 19, 2026): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల మధ్య గర్భాలయంలోని మూలవిరాట్, ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలను సమర్పించి, పంచాంగ శ్రవణం, ఆస్థానం నిర్వహించారు. అదే విధంగా ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి ఆస్థానం శ్రీరామనవమి సందర్భంగా, సాయంత్రం 6:30 నుండి 8 గంటల మధ్య హనుమంత వాహన సేవ, అనంతరం 9 నుండి 10 గంటల మధ్య గరుడాళ్వార్ సన్నిధిలో ప్రత్యేక ఆస్థానం జరుగుతుంది. ఇక.. ప్రత్యేకంగా ఈ నెల 28న పట్టాభిషేక ఆస్థానం శ్రీరామనవమి మరుసటి రోజు సీతారాముల పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనితో..
ఈ ఆస్థానాల సమయంలో స్వామివారికి వేద పండితులు ‘శ్రీరామ జననం’ వంటి విశేష ఘట్టాలను పఠిస్తారు. ఇలా వరుసగా మూడు స్థానాలు నిర్వహించడం అరుదైన ఘట్టంగా చెబుతున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు దర్శనం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు సమాచారం.. ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

టిటిడి: తిరుమల ఆలయంలో రానున్న ముఖ్యమైన ఉత్సవాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెలలో మూడు ఆస్థానాలను ఏర్పాటు చేశారు.

Source link