ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల ప్రదర్శన. గురువారం నాడు 68,754 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,569 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.68 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది.
తిరుమల శ్రీవారి దర్శన క్యూలైన్‌లో టీటీడీ, అధికారులకు వ్యతిరేకంగా ఓ భక్తుడు నినాదాలు చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నారాయణగిరి షెడ్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్యూ లైన్ గుండా శ్రీవారి దర్శనానికి వెళ్తోన్న ఆ భక్తుడు టీటీడీకి వ్యతిరేకంగా తాను నినాదాలు చేయడంతో పాటు తోటి భక్తులను కూడా అందుకు ప్రేరేపించడం ఈ వీడియోలో రికార్డ్ అయ్యింది.

అతన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అనుపోజు వీర నవీన్‌గా పేర్కొన్నారు. ఈ విషయం టీటీడీ అధికారుల దృష్టికి చేరింది. దీంతో అధికారులు నవీన్ ను పిలిపించి మాట్లాడారు. దర్శన క్యూలైన్‌లో నినాదాలు చేయడం పట్ల గల కారణాలను గురించి ఆరా తీశారు. అలా నినాదాలు చేయడం ముమ్మాటికీ తప్పేనని నవీన్ ఒప్పుకొన్నాడు. ఇందుకు టీటీడీ, శ్రీవారి భక్తులకు అతను క్షమాపణలు తెలిపాడు.
ఈ నేపథ్యంలో టీటీడీ తాజాగా భక్తులకు తాజా అప్పీల్ చేసింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో క్యూ లైన్‌లో గానీ, కంపార్ట్ మెంట్లలో గానీ తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఓపిగ్గా వేచి ఉండాలని సూచించింది. టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వంక- వేసవిలో భక్తులకు మంచినీటి పంపిణీ, నడక దారి భక్తులకు మధ్య షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేయాలని నిర్ణయించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వసతి సౌకర్యాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయనున్నారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు.
ఆంగ్ల సారాంశం
నారాయణగిరి క్యూ లైన్‌లో నినాదాలు చేస్తూ తప్పును అంగీకరించిన భక్తుడు సహనం వహించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. రాజమహేంద్రవరానికి చెందిన ఓ భక్తుడు నారాయణగిరి షెడ్లలో నిరీక్షిస్తూ తోటి భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశాడు. టీటీడీ అతడిని పిలిపించి మాట్లాడగా క్యూలైన్‌లో నినాదాలు చేయడం తప్పేనని ఒప్పుకున్నాడు.