seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 1:36 am Digital Edition : SEEMA KIRANAM

తిరుమల క్యూలైన్లలో కఠిన నిబంధన | స్లాట్ చేయబడిన సర్వ దర్శనం టోకెన్లు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులను సమయ స్లాట్‌లో అనుమతించబడతాయి

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తిరుమలలో భక్తుల ప్రదర్శన. శనివారం నాడు 72,528 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.41 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.

కాగా- స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచనలు అందించారు. ఆయా టికెట్లు ఉన్న భక్తులు- వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలో మాత్రమే క్యూలైన్‌లోకి ప్రవేశించడానికి అనుమతిని టీటీడీ ప్రకటించింది. ఈ నిబంధనను సోమవారం నుంచి కఠినంగా అమలు చేస్తోందని తేల్చి చెప్పింది.

స్లాట్ చేయబడిన సర్వ దర్శనం టోకెన్లు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులను సమయ స్లాట్‌లో అనుమతించబడతాయి

భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని సూచించారు. అలాగే వారికి కేటాయించిన స్లాట్‌లో మాత్రమే క్యూ లైన్‌లో ప్రవేశించి, సమయ నిబంధనలను పాటించే భక్తులను ఇబ్బంది పెట్టకుండా టైం కోసం విజ్ఞప్తి చేస్తోంది. భక్తులకు తగిన దర్శనం కల్పించేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు కోరింది.

మరోవంక- సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చర్యలు చేపట్టింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా అన్నప్రసాదం, మంచినీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేయాలని నిర్ణయించింది.

భక్తుల దాహార్తిని తీర్చడానికి తిరుమలలో విరివిగా మజ్జిగ పంపిణీ పాయింట్లు ఏర్పాటు కానున్నాయి. వసతి సౌకర్యాలు, అన్నప్రసాదం నిర్వహణ మరింత మెరుగుపడనున్నాయి. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ అందుబాటులోకి రానున్నాయి. వేసవిలో కంపార్ట్ మెంట్లు, లైన్లలో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే క్యూ సమయాన్ని తగ్గించడం, వారికి చాలా త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది.

ఆంగ్ల సారాంశం

స్లాట్ చేయబడిన సర్వ దర్శనం టోకెన్లు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు టైమ్ స్లాట్‌లో అనుమతి ఉంటుంది. భక్తులందరూ దీనిని గమనించి, తమకు కేటాయించిన సమయానికి మాత్రమే క్యూ లైన్‌లకు చేరుకోవాలని, తద్వారా యాత్రికులందరికీ సాఫీగా మరియు సౌకర్యవంతంగా దర్శనం కల్పించాలని టిటిడి తన భక్తులను అభ్యర్థించింది.

Source link