seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 2:29 am Digital Edition : SEEMA KIRANAM

తిరుమలలో చురుగ్గా వేసవి ఏర్పాట్లు- రోజూ | దర్శనం కోసం టిటిడి పటిష్టమైన వేసవి సెలవుల సన్నద్ధత ప్రణాళికను రూపొందించడంతో భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తిరుమలలో భక్తుల ప్రదర్శన. మంగళ నాడు 27,682 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 9,985 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.46 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది.

వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చర్యలు చేపట్టింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది. టీటీడీడీ అదనపు కార్యనిర్వహణ సీహెచ్ వెంకయ్య చౌదరి ఇదివరకే సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు- మూడు సంవత్సరాల వేసవి డేటాను తీసుకుని సంఖ్య, వేచి ఉండే సమయం వంటి భక్తుల గురించి విస్తృతంగా చర్చించారు.

దర్శనం కోసం టిటిడి పటిష్టమైన వేసవి సెలవుల సన్నద్ధత ప్రణాళికను రూపొందించడంతో భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు

భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి అన్నప్రసాదం, మంచినీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేయాలని నిర్ణయించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వసతి సౌకర్యాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయనున్నారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు.

వేసవిలో కంపార్ట్ మెంట్లు, లైన్లలో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే క్యూ సమయం తగ్గించడం, వారికి చాలా త్వరగా జరిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు టీటీడీ అధికారులు. ఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచి, కంపార్ట్ మెంట్లలో రద్దీ, గంటల వారీగా ఇన్-అవుట్ ఫ్లో, వేచి ఉండే సమయాన్ని ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

గత వేసవిలో జూన్‌లో టీటీడీ అధికారులు సగటున రోజుకు 80 వేల నుంచి 82 వేల మందికి దర్శనం కల్పించారు. సమర్థవంతమైన సమయ నిర్వహణ, అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైందని చెబుతున్నారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిలో భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో కార్యరంగంలోకి దిగాయి.

ఆంగ్ల సారాంశం

దర్శనం కోసం TTD పటిష్టమైన వేసవి సెలవుల సన్నద్ధత ప్రణాళికను రూపొందించడంతో భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేసవి సెలవులు త్వరలో ప్రారంభం కానున్నందున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్. తిరుమలలో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు- మూడు సంవత్సరాల వేసవి డేటాను తీసుకుని సంఖ్య, వేచి ఉండే సమయం వంటి భక్తుల గురించి విస్తృతంగా చర్చించారు.

Source link