ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాస్వామివరాత్రి పర్వదినం ఘనంగా ప్రారంభం అయింది. శివనామస్మరణతో మార్మోగిపోతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఈ తెల్లవారు జామున 6 గంటల’కు సర్వ’దర్శ’నం ప్రారంభమైంది. పెద్దసంఖ్యలో భక్తులు శ్రీ కపిలేశ్వరస్వామివారిని, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహిం చారు. వేలాదిమంది స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆత్మ రథికుడు. శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే మార్గాలు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ భిన్నమైన ఆత్మానాత్మ వివేకాన్ని బోధించే రథోత్సవం ఇది.

రథోత్సవనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకుల స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. గృహస్తులు (ఇద్దరు) అప్పటికప్పుడు రూ.500 చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
అదే సమయంలో శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నేడు ఎనిమిదో రోజు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7:45 నిమిషాలకు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి రథోత్సవ మహోత్సవం పండుగ వాతావరణంలో వేడుకలు.
వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథం నాలుగు మాడ వీధులలో మహా వైభవంగా రథయాత్ర సాగింది. రథోత్సవం సందర్భంగా భక్తుల సందడి, ఆనందోత్సాహాలు ప్రత్యేకంగా కనిపించాయి. గోవిందుడిని స్మరిస్తూ భక్తుల రథాన్ని లాగారు. తమ కోరికలు నెరవేరాలని, ఆ దేవదేవుడి ప్రార్థించారు. దివ్య దర్శనం కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున ఉన్నారు.
భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ 7 నుండి రాత్రి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన సోమవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది.
ఆంగ్ల సారాంశం
కపిలతీర్థం, శ్రీనివాస మంగాపురం ఆలయాల్లోని పవిత్ర ఆలయ వీధుల గుండా రథోత్సవం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథం నాలుగు మాడ వీధులలో మహా వైభవంగా రథయాత్ర సాగింది.