ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్. ఉమేష్
గుంటూరు ప్రతినిధి, ఏప్రిల్ 20, (సీమకిరణం న్యూస్) :
తాడికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. ఉమేష్ సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ ఉమేష్ ఎస్పీ కి మొక్కను అందజేశారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ ఉమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. సీఐ ఆర్. ఉమేష్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా, సీఐగా విశేష అనుభవం సంపాదించారు. ఇటీవల తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహించిన ఆయన, సాధారణ బదిలీలలో భాగంగా తాడికొండ సీఐగా బాధ్యతలు స్వీకరించారు.