భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆధ్వర్యంలో టీవీకే పార్టీ తొలిసారిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు అధికారాన్ని కాపాడుకునే పనిలో డీఎంకే పార్టీ శ్రమిస్తోంది. ఇక అన్నాడీఎంకే- బీజేపీ కూటమి సైతం ఈసారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
అయితే టీవీకే అధ్యక్షుడు విజయ్ కు టీవీకే పార్టీ నేతలు, కార్యకర్తలు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. అదేంటంటే..? విజయ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న తరుణంలో పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 22న జరిగిన టీవీ క్యాడర్ మీటింగ్‌లో నేతలు, కార్యకర్తలు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ టీవీకే పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్ మెంట్ సెక్రటరీ ఆధవ్ అర్జున ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ మాట్లాడూతూ..” మేము ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించాం. ఈ మేరకు టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
అధిక పేదరికం ఉన్న ప్రాంతం నుంచి పార్టీ అధికార పోటీ చేయడానికి పార్టీ తీర్మానం చేసింది. నార్త్ చెన్నైలో ఈ సమస్య అధికంగా ఉంది. అందువల్ల పార్టీ అధినేత విజయ్.. నార్త్ చెన్నైలోని పెరంబూర్, కోలత్తూర్, ఆర్కే నగర్‌లో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీవీకే పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ ఆధవ్ స్పష్టం చేశారు. అలాగే ఇప్పటినుంచి చెన్నై టీవీ పార్టీకి చెందినది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు అధికార డీఎంకే పార్టీకి పరోక్షంగా చురకలు అంటించారు.

ఇక దళపతి విజయ్ నటించిన జన నాయకన్ మూవీ నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఎన్నికల తర్వాత విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కోరుకున్నట్లు సమాచారం.