ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->పార్లమెంట్ సాక్షిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు చర్చ జరగనుంది. తీర్మానానికి టీఇక్ సైతం మద్దతు ప్రకటించింది. ఈ రోజు, రేపు చర్చ జరగనుంది. ప్రభుత్వం సమాధానం తరువాత సభలో ఓటింగ్ జరిగింది. కాగా.. ఈ అంశంలో వైసీపీ మద్దతు ఎవరికి.. ఓటింగ్ వేళ ఎవరి వైపు నిలబడుతుందనే చర్చ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ ఎంపీలకు ఇదే అంశం పైన జగన్ స్పష్టత ఇచ్చారు.
పార్లమెంట్ లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. లోక్ సభ స్పీకర్ పైన పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పైన నోటీసు ఇచ్చారు. ఈ రోజు, రేపు ప్రభుత్వం చర్చకు సిద్దమైంది. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది కీలకంగా మారుతోంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కు లోక్ సభలో లేదు. మిగిలిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తమ పార్టీల వైఖరికే కట్టుబడి ఉన్నారు. ఏపీ నుంచి కూటమికి 21 మంది ఎంపీలు ఉండగా.. వారంతా ఎన్డీఏకు మద్దతుగా నిలిచారు. వైసీపీ నుంచి నలుగురు ఉన్నారు. వారు ఇప్పుడు ఈ చర్చలో ఎవరికి మద్దతుగా మాట్లాడుతారు… ఓటింగ్ జరిగితే ఎవరి వైపు నిలుస్తారనే చర్చ సాగుతోంది. అయితే, జగన్ ఇప్పటికే పార్టీ ఎంపీలతో ఇదే అంశం పైన పార్టీ వైఖరి తేల్చి చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో అధికారం ఉన్నా.. ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన విధంగానే… స్పీకర్ కు అనుకూలంగా ఎన్డీఏ వైపే నిలవాలని నిర్ణయం తీసుకున్నారు.

జగన్ తాజా నిర్ణయంతో కొత్త సమీకరణలు
కాగా, సభాపతిపై అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే సభలో హాజరైన, ఓటు వేసిన సభ్యులలో సగానికంటే ఎక్కువ సాధారణ మెజారిటీ అంటే 273 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం.. ఇండియా బ్లాక్ మొత్తం బలం సుమారు 234 సీట్లు. విపక్షాలన్నీ కలిసి ఓటేసినా ఎన్డీఏ మెజారిటీని దాటలేవు. తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువ. అధికార ఎన్డీఏ బలం సుమారు 293 స్థానాలతో పటిష్ఠంగా ఉంది. ఎన్డీఏ కూటమిలో లేని వైసీపీ, శిరోమణి అకాలీదళ్, స్వతంత్ర ఎంపీల మద్దతు కలిస్తే ఈ బలం 300 దాటుతుంది. ఇలా ఎన్డీఏకు స్పష్టమైన సంఖ్యాబలం ఉండటంతో స్పీకర్‌గా ఓం బిర్లాయే పుష్కలంగా ఉన్నారు. అయితే, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు వేళ ఎన్డీఏకు మద్దతు ఇస్తే భవిష్యత్ సమీకరణలు ఎలా ఉంటాయి.. ఈ సమయంలో జగన్ ఏదైనా భిన్నమైన నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.
ఆంగ్ల సారాంశం
లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్సీపీ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది.