డోన్ లో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
డోన్ టౌన్, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అనుచితమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కూటమి నాయకులు మరియు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాష్ట్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం తగదని,...