డీఎస్పీ శ్రీనివాసులును మర్యాదపూర్వకంగా కలిసిన డోన్ ఎంవీఐ క్రాంతికుమార్
పోలీస్ మెడల్ అందుకున్న డీఎస్పీ శ్రీనివాసులకు అభినందనలు తెలిపిన డోన్ ఎంవీఐ క్రాంతికుమార్ డోన్, ఆగస్టు 25, (సీమకిరణం న్యూస్): పోలీస్ మెడల్ అందుకున్న డీఎస్పీ శ్రీనివాసులను డోన్ ఎంవీఐ క్రాంతికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించి పోలీస్ మెడల్ అందుకున్న డీఎస్పీ శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఎంవీఐ క్రాంతికుమార్ ఆకాంక్షించారు.