భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->ఎన్నికల సంఘం మార్చి 15 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందో లేదో అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయం ఇప్పుడంతా స్టార్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూనే తిరుగుతున్నారు. ఎలాగైనా విజయ్ ను ఎన్డీయే కూటమిలోకి లాగాలని బీజేపీ పావులు కదుపుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తోంది. అయితే విజయ్ అందుకు సుముఖంగా లేనప్పటికీ తెర వెనుక మాత్రం ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది.
డిప్యూటీ సీఎం పదవి, 80కి పైగా అసెంబ్లీ స్థానాలను తమ పార్టీకి కేటాయిస్తే ఎన్డీయే కూటమిలో చేరేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం డిప్యూటీ సీఎం పదవితో పాటుగా 55 సీట్లు కేటాయిస్తానని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. త్వరలో రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. అధికార డీఎంకే- కాంగ్రెస్ ను ఓడించాలంటే విజయ్ తో పొత్తు పెట్టుకోవాల్సిందేనని బీజేపీ భావిస్తోంది.
అయితే టీవీకే పార్టీని ఎన్డీయే కూటమిలోకి లాగడాన్ని ఏఐఏడీఎంకే పార్టీ తప్పుబడుతోంది. ఈ పొత్తుపై ఈ మేరకు ఎడప్పాడి పళనిస్వామి (EPS) ఏఐఏడీఎంకే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పొత్తులో భాగంగా విజయ్‌కి ఎక్కువ సీట్లు కేటాయిస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ పార్టీకి కేవలం 100 నుంచి 110 సీట్లు మాత్రమే మిగుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విజయ్ ను ఎన్డీయే కూటమిలోకి రానివ్వకుండా ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. టీవీకే తమ పార్టీ కార్యకర్తల అస్తిత్వ దెబ్బ పడుతుందని పళనిస్వామికే కనిపిస్తోంది.
సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా కూడా వస్తున్నారు. అలాగే AIADMK తోనూ తమకు సంబంధం లేదని అంటున్నారు. మరి ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇప్పటికే విజయ్.. సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. దాంతో విజయ్.. ఎన్డీయే కూటమిలో చేరతారని అందరూ. అటు విజయ్ కుటుంబాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీటన్నింటి మధ్య విజయ్ టీవీకే పార్టీ రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబడుతుందో వేచి చూడాలి.

ఇక తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఓటింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.