ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మంత్రి నారా లోకేష్ భవిష్యత్తు రాజకీయ ఎదుగుదల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకపక్క తన మార్క్ చూపించాలని ప్రయత్నం చేస్తున్న లోకేష్ మరో వైపు పార్టీపైన బలమైన ముద్ర వేయడానికి రంగంలోకి దిగారు. ఇందులోభాగంగా ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ అంటూ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు తనతో కలిసి విందుచేసే అవకాశాన్ని ఇచ్చి ఇంటికి పిలిచి గౌరవించి వారందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు ఉన్న పట్టు, చంద్రబాబు నాయుడుకు ఉన్న పేరు, ఆయన సామర్థ్యానికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అటువంటి చంద్రబాబు తన తర్వాత టిడిపిని నడపడానికి, సీఎం పదవిలో కూర్చోవడానికి సమర్థుడైన నాయకుడిగా, తన వారసత్వంగా నారా లోకేష్ ను రాజకీయాలలోకి తీసుకువచ్చారు.

లోకేష్ సామర్ధ్యంపై గతంలో చర్చ.. సీఎం ఆలోచనకు బ్రేక్
అయితే లోకేష్ కు గతంలో రాజకీయంగా పరిణితి లేకపోవడంతో, ప్రతిపక్ష పార్టీలు లోకేష్ ను అసమర్థుడని, పప్పు అని రకరకాలుగా చిత్రీకరించి ప్రజలలోకి వెళ్ళడంతో లోకేష్ సామర్థ్యంపై పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరిగింది. చాలామంది సీనియర్లు లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించలేని స్థితి వచ్చింది. ఇక ఈ కోరికనే లోకేష్ భవిష్యత్తు సీఎం అనే చర్చకు బ్రేక్ వేసి చంద్రబాబు రాజకీయాలు సాగిస్తున్నారు.
రాజకీయంగా పరిణతి సాధిస్తున్న లోకేష్
అయితే రాజకీయంగా పరిణితి సాధించి, అందరి మెప్పు పొంది, పార్టీ పైన పూర్తి పట్టుతో సీఎం అవ్వాలని ఆలోచిస్తున్న లోకేష్ ఈ విధంగానే వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో యువ గళం పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, నాటి ప్రభుత్వ నిరంకుశత్వానికి ఎదురొడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం లోకేష్ తన పాదయాత్రతో ప్రజలలో గుర్తించబడ్డాడు.
అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఫ్యామిలీ మెంబర్స్ తో డిన్నర్
మంగళగిరి ఎమ్మెల్యేగా నియోజకవర్గం సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, మంత్రిగా తనకు అప్పగించిన శాఖల బాధ్యతను సమర్థించారు. ప్రస్తుతం పార్టీ పైన దృష్టి సారిస్తున్న లోకేష్ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ ని తన ఇంటికి పిలిచి ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక కొత్త సంప్రదాయానికి తెర తీశారు లోకేష్.
ఆ విష్ తోనే ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్
అందరూ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ముందుకు వెళ్లేందుకు. కుటుంబ వాతావరణం లో జరిగే ఈ డిన్నర్ సమావేశం ద్వారా వారందరి మద్దతును కూడగట్టుకుంటున్నారు. భవిష్యత్తులో మద్దతుతో సీఎం అవ్వాలంటే విష్ ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ తో ప్రధానంగా కనిపిస్తారని రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా లోకేష్ ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా లేదా అన్నది భవిష్యత్తులో తేలనుంది.
ఆంగ్ల సారాంశం
లోకేష్ తో ఫ్యామిలీ డిన్నర్ అంటూ పార్టీ ఎమ్మెల్యేలందరినీ తన ఇంటికి పిలిచి తనతో కలిసి డిన్నర్ చేయడం ద్వారా వారి మద్దతు కూడగట్టేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో కాబోయే సీఎం కోరిక స్పష్టంగా కనిపిస్తోంది.