ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->ఏపీలో గత హయాంలో చోటు చేసుకున్న తిరుమల కల్తీ నెయ్యి వివాదం వైసీపీ క్రమంగా టీటీడీ (TTD)మెడకు చుట్టుకుంటుంది. గతంలో టీటీడీ పాలకమండలిని నడిపిన వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారు ఈ వివాదంలో అధికారుల పాత్ర ఉందని, తమకేం సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు సిట్ కూడా అదే కారణంతో ఉద్యోగులనే టార్గెట్ చేస్తోంది. సిట్ దర్యాప్తులో కల్తీ నెయ్యి వాడేందుకు సహకరించిన 9 మంది టీటీడీ ఉద్యోగులపై అభియోగాలు మోపిన సిట్.. ఇప్పుడు మరో ఆరుగురికి షాకిచ్చింది.
తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీలో ఆరుగురు ఉద్యోగులకు ప్రమేయం ఉందని సిట్ తేల్చింది. గతంలో అభియోగాలు మోపిన 9 మంది ఉద్యోగులతో వీరిపై పెద్ద ఆరోపణలు లేకపోవడంతో శాఖాపరమైన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని సిట్ సూచించింది. ఈ మేరకు టీటీడీకి తాజాగా సిట్ లేఖ రాసినట్లు. దీంతో టీటీడీ ఇప్పుడు ఆరుగురు సొంత ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతోంది.

కల్తీ నెయ్యి వివాదంలో పాత్ర ఉందని గుర్తించిన వారిలో టీటీడీ డిప్యూటీ ఈవో పద్మావతితో పాటు వీఎస్ సురేశ్ కుమార్, జ్యోతీశ్వరుడు, పార్ధసారధి, భోపాలన్ మురళి, వెంకటరమణ వంటి వారు ఉన్నారు. నెయ్యి కొనుగోళ్లు, గోడౌన్లలో విధులు నిర్వర్తించిన సమయంలో వీరు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి కల్తీకి సహకరించారని సిట్ గుర్తించింది. వీరిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు సిట్ లేఖల నేపథ్యంలో టీటీడీ అధికారులు, ఉద్యోగుల్లో అలజడి కొనసాగుతోంది.