seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 2:50 pm Digital Edition : SEEMA KIRANAM

టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా ముద్దాడ రవిచంద్ర

టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఇన్‌ఛార్జ్ ఈవోగా సీఎంవో ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నేడు ఉదయం సతీసమేతంగా భూవరాహ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన ఆయన రంగనాయకుల మండపంలో ఇన్‌ఛార్జ్‌ ఈవోగా బాధ్యతలు స్వీకరించి శ్రీవారిని దర్శించుకున్నారు.