టాలీవుడ్ యూనియన్ వార్‌కు బాలయ్య ఫుల్‌స్టాప్

టాలీవుడ్ యూనియన్ వార్‌కు బాలయ్య ఫుల్‌స్టాప్..   రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించిన బాలకృష్ణ..!   హైదరాబాద్, జూలై 20, (సీమకిరణం న్యూస్):   టాలీవుడ్‌లో ఇటీవల డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు సద్దు మణిగినట్లు నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ వెల్లడించారు. పరిశ్రమలోని సంఘాల మధ్య ఏర్పడిన చిన్న చిన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించామని ఆయన తెలిపారు. ఈ వివాదం పరిష్కారంలో నటుడు నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషించినట్లు ప్రసన్నకుమార్ చెప్పారు. కాకినాడలో...