seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 11:55 pm Digital Edition : SEEMA KIRANAM

టార్గెట్ ఒలింపిక్స్: సీఎం రేవంత్ కీలక నిర్ణయం | revanthreddy pushs for Olympic Ready Sports University: Multi-Sport Grounds WorldClass Facilities

తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు చేయూతను అందించిన సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఈ మేరకు క్రీడాశాఖపై సమీక్ష నిర్వహించారు.అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై చర్చించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

క్రీడాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు చేయూతను అందించడానికి సూచనలు చేశారు. గచ్చిబౌలి ఔట్ డోర్ క్రీడాకారులను పురోగమించడంతోపాటు, స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.

ఈ మేరకు నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లను అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. డిజైన్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. మరో ఒలంపిక్స్, కామన్ వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా, ఒలంపిక్స్ లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు.

ఒలింపిక్ రెడీ స్పోర్ట్స్ యూనివర్సిటీ మల్టీ-స్పోర్ట్ గ్రౌండ్స్ వరల్డ్ క్లాస్ సౌకర్యాల కోసం రేవంత్ రెడ్డి ముందుకు

అలాగే రెడ్డి కోట్ల విజయభాస్కర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను ఆధునిక అవసరాలు, శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, SAT చైర్మన్ శివసేన రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఉన్నారు.

Source link