అంతర్జాతీయ
ఓయ్-సయ్యద్ అహ్మద్
భారత్-పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని వాడుకుంటూ అమెరికా చేసే రాజకీయాలు ఎలా ఉంటాయన్నది పలు సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా భారత్‌లోని పహల్‌గా భారత్‌లోని ఉగ్రదాడి పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ సమయంలో మధ్యవర్తిగా ఎంట్రీ ఇచ్చి ఇద్దరి మధ్య కాల్పుల విరమణ చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ వాదనతో భారత్ ఏకీభవించకపోవడం, తాము అడగ్గానే కాల్పుల విరమణకు సహకరించడంతో ట్రంప్ కు పాక్ దగ్గరైంది. ఆ తర్వాత భారత్ పై భారీ సుంకాలు విధించి, పాకిస్థాన్ పాలకులతో ట్రంప్ విందులు చేసుకున్నారు.
దీనితో పాకిస్తాన్ కూడా ఇక అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు భారీ స్థాయిలో ప్రయోజనం పొందాలని, భారత్ తో ట్రంప్ బంధం బీటలు వారత లెక్కలేసుకుంది. కానీ సీన్ రివర్స్ అయింది. భారత్ వంటి భారీ మార్కెట్ ను వదులుకుని, నానాటికీ ఆర్థికంగా బీటలు వారుతున్న పాకిస్థాన్ కు అండగా నిలిచేందుకు ట్రంప్ నో చెప్పారు. దీని ఫలితమే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందం ఇచ్చిన షాక్ నుంచి పాక్ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది.

దీంతో అమెరికా తమను వాడుకుని టాయిలెట్ పేపర్ లా విసిరేశారని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (khawaja asif) ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమెరికాతో ఉన్న బంధాన్ని ఆయన అంగీకరించారు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తమ దేశాన్ని దోపిడీ చేసిందని, వాళ్ల లక్ష్యాలు నెరవేరాక టాయిలెట్ పేపర్ ముక్కలాగా విసిరేసిందని ఆయన చెప్పారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. తమ దేశం తరచూ తమకున్న ఉగ్రవాద చరిత్రను తిరస్కరిస్తుందని, కానీ ఇది గతంలో జరిగిన తప్పు అని అంగీకరించారు.

పాకిస్తాన్ యుద్ధం కోసం యుఎస్‌కు అద్దెకు ఇచ్చిందని మరియు తరువాత “టాయిలెట్ పేపర్ లాగా” విస్మరించబడిందని ఖ్వాజా ఆసిఫ్ పార్లమెంటులో అంగీకరించాడు. పార్లమెంటులో ఇప్పుడు బహిరంగంగా అంగీకరించిన విధానాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేయబడింది. లక్షల మంది బాధపడ్డారు. తరాలు పోయాయి. ప్రపంచం ఇప్పుడు దూరంగా చూడదు… pic.twitter.com/aEQjrm16ME
— మరియం సోలైమంఖిల్ (@మరియమిస్తాన్) ఫిబ్రవరి 10, 2026
అలాగే రెండు ఆఫ్ఘన్ యుద్ధాలలో పాకిస్థాన్ భాగస్వామి కావడాన్ని కూడా మరో తప్పుగా అభివర్ణించారు. ఇవాళ పాకిస్థాన్‌లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు తమ గత తప్పులకు ప్రతిఫలమని అంగీకరించారు. 1999 ఆప్ఘనిస్తాన్ విషయంలో అమెరికా-పాకిస్తాన్ తర్వాత కలిసి పనిచేయడం తమ దేశానికి శాశ్వత నష్టాన్ని మిగిల్చిందని ఖవాజా సూచిస్తుంది. 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత అమెరికాతో తిరిగి పొత్తు పెట్టుకోవడం వల్ల కలిగిన నష్టాలు చాలా దారుణంగా ఉన్నాయి. పాకిస్తాన్‌ను టాయిలెట్ పేపర్ ముక్క కంటే దారుణంగా చూశారని, దానిని తమ ప్రయోజనాల కోసం వాడుకుని విసిరేశారని.

