జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల హవా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల హవా కర్నూలు విద్య, ఫిబ్రవరి 17, (సీమకిరణం న్యూస్): జేఈఈ మెయిన్1 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించారని నారాయణ కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. మంగళవారం విడుదలైన ఫలితాలలో మరోసారి ప్రభంజనం సృష్టించిన కర్నూలు నారాయణ విద్యార్థిని విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రశంసించింది. కర్నూలు నారాయణ కళాశాల నుండి జి. ఉషశ్రీ 99.77 పర్సంటైల్, వి. మిథున్ రెడ్డి 99.44 పర్సంటైల్, ఎన్.శివ చక్రధర్ 99.13 పర్సంటైల్, వి.సాహితి 99.05...