seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 10:57 am Digital Edition : SEEMA KIRANAM

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల హవా

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల హవా

కర్నూలు విద్య, ఫిబ్రవరి 17, (సీమకిరణం న్యూస్):

 

జేఈఈ మెయిన్‌1 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించారని నారాయణ కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. మంగళవారం విడుదలైన ఫలితాలలో మరోసారి ప్రభంజనం సృష్టించిన కర్నూలు నారాయణ విద్యార్థిని విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రశంసించింది. కర్నూలు నారాయణ కళాశాల నుండి జి. ఉషశ్రీ 99.77 పర్సంటైల్, వి. మిథున్ రెడ్డి 99.44 పర్సంటైల్, ఎన్.శివ చక్రధర్ 99.13 పర్సంటైల్, వి.సాహితి 99.05 పర్సంటైల్, బి. హృతిక్ రెడ్డి 98.68 పర్సంటైల్, పి. సుగంధిని రెడ్డి 98.47 పర్సంటైల్, మహబూబ్ బాషా 98.26 పర్సంటైల్, షేక్ మొహమ్మద్ రాయన్ వాసి 98.03 పర్సంటైల్, మొహమ్మద్ ఖాజా ఫైజ్ అహ్మద్ 98.01 పర్సంటైల్, ప్రణవ్ జాయ్ 97.85 పర్సంటైల్, ఖాజీ మహమ్మద్ ఫహాద్ 97.60 పర్సంటైల్, ఎస్.ప్రశాంత్ 97.51 పర్సంటైల్, కె.నాగశివ బాలాజి 97.45 పర్సంటైల్, ఎమ్. హర్షవర్ధన్ 97.32 పర్సంటైల్, బి. రణధీర్ 97. 32 పర్సంటైల్ సాధించారు. అలాగే 99 పర్సంటైల్ పైన నలుగురు, 98 పర్సంటైల్ పైన 9 మంది, 97 పర్సంటైల్ పైన 15 మంది, 96 పర్సంటైల్ పైన 19 మంది, 95 పర్సంటైల్ పైన 24 మంది, 90 పర్సంటైల్ పైన 52 మంది విద్యార్థులు ఆర్హత సాధించారు. ఉత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులను నారాయణ యాజమాన్యం అభినందిచారు. ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, డి.వేణు గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి.సుజాత, వెంకటరాముడు, బి. విజయ మోహన్, రెవతి, ఎ.సరితసాగర్, సాంబశివారెడ్డి, రామసుబ్బారెడ్డి, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.