వ్యాపారం
ఓయి-లింగారెడ్డి గజ్జల
<!--
--> <!-- -->ఐటీ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ల విషయంలో చిన్న షాక్ ఇవ్వొచ్చని సంకేతాలు వినిపిస్తున్నాయి. కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి రావడంతో కంపెనీల ఖర్చులు ఒక్కసారిగా పెరిగాయి. ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఓవర్‌టైం, బోనస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రయోజనాలు విస్తరించడంతో వేతన బిల్లులపై అదనపు భారం పడుతోంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉన్న ఐటీ సంస్థలు ఈ మార్పుల ప్రభావం ఇప్పటికే తమ లాభాల్లో చూడడం ప్రారంభించాయి.
నవంబర్ 2025 నుంచి అమలులోకి వచ్చిన కార్మిక సంస్కరణల కారణంగా కంపెనీలు ఒకేసారి భారీ కేటాయింపులు చేయాల్సి వచ్చింది. అమలు వ్యయాలు, నిబంధనల ప్రకారం పెరిగిన బాధ్యతలు కలిపి గత త్రైమాసిక ఫలితాల్లో కొంత ఒత్తిడిని చూపించాయి. లాభాల మార్జిన్లు కుదించబడటంతో, రాబోయే సంవత్సరంలో వేతన పెంపులపై సంస్థ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Salary Hike అందరిపై ఒకేలా ఉంటుందా?
అయితే అందరికీ ఒకేలా ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలు, కీలక బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులకు కంపెనీలు హైక్ తగ్గించే అవకాశం తక్కువ. ఎందుకంటే వేతన వృద్ధి అనేది కేవలం నిబంధనల వ్యయాలపై కాదు; టాలెంట్‌కు ఉన్న డిమాండ్, పనితీరు, ఉత్పాదకత వంటి వాటికి ఎక్కువగా ఆధారపడుతుంది. వేతనాలను కోరితే ఉద్యోగుల వలసలు పెరిగే ప్రమాదం ఉందని సంస్థలు గ్రహిస్తున్నాయి.
కొంత పరిమితం..
అయితే మార్జిన్ల ఒత్తిడితో ఉన్న కొన్ని ఐటీ కంపెనీలు, అలాగే కొన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మాత్రం ఇంక్రిమెంట్లను కొంత పరిమితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగుల ఖర్చులు మొత్తం ఆదాయంలో పెద్ద వాటా ఉన్న సంస్థలకు 8-9 శాతం పెంపు కూడా సవాలుగా మారొచ్చు. 2026లో సగటు ఇంక్రిమెంట్ 9 శాతం వరకు ఉండొచ్చని అంచనాలు, రంగాల వారిగా తేడాలు కనిపించవచ్చు.
ఉద్యోగులతో మంచి బంధం..
ఈ నేపథ్యంలో కంపెనీలు వేతన నిర్మాణాలను పునఃసమీక్షించే పనిలో ఉన్నాయి. అవుట్‌సోర్సింగ్, ఆటోమేషన్, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ వంటివి మళ్లీ ఆలోచిస్తున్నాయి. ఉద్యోగులతో మంచి బంధం కొనసాగించడం కూడా సంస్థలకు కీలకం. కాబట్టి పూర్తిగా పెంపుదల నిలిపివేయడం కన్నా, మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
మొత్తానికి, లేబర్ కోడ్‌లు ఉద్యోగులకు కొత్త ప్రయోజనాలు తీసుకొచ్చినా, ఐటీ రంగంలో ఇంక్రిమెంట్ల వేగంపై కొంత ప్రభావం చూపితే పూర్తిగా తోసిపుచ్చలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆంగ్ల సారాంశం
గ్రాట్యుటీ మరియు ఓవర్‌టైమ్ వంటి ఉద్యోగుల ప్రయోజనాలను పెంచే కొత్త లేబర్ కోడ్‌లు 2026లో IT జీతాల పెంపుపై ప్రభావం చూపవచ్చు. సమ్మతి ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఇంక్రిమెంట్‌లు మందగించవచ్చని నిపుణులు అంటున్నారు.