seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 8:46 am Digital Edition : SEEMA KIRANAM

జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రారంభించిన డాక్టర్. శంకర్ శర్మ

కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించాలి 

 

ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ

 

కర్నూలు స్పోర్ట్స్, ఫిబ్రవరి 20, (సీమకిరణం న్యూస్):

కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. విలువిద్య సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల నైపుణ్యం, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేసి దేశభక్తిని కలిగించే శక్తి ఒక్క స్పోర్ట్స్ కే ఉంటుందన్నారు. విలు విద్య ఎంతో ప్రాచీనమైనదని ఒలంపిక్స్ లో సైతం భారతీయులు పథకాలు సాదించారని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. ఇలాంటి క్రీడల్లో చిన్నారులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించాలని డాక్టర్. శంకర్ శర్మ కోరారు.