జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు డోన్ లో సర్వం సిద్ధం
డోన్ టౌన్, మే 15,(సీమ కిరణం న్యూస్):


డోన్ పట్టణంలోని బుగ్గన శేషారెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈనెల 17వ తేదీ ఆదివారం జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు ఇండోర్ స్టేడియం నిర్వాహకులు, వెంకట్రావు, చైతన్య రాజ్, విక్రమ్, మరియు టోర్నమెంట్ నిర్వాహకులు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, శేగు లోకేష్ తెలిపారు. ఓపెన్, 40 ప్లస్, 50 ప్లస్ కేటగిరీల్లో డబుల్స్ పోటీలు నిర్వహించబడనున్నాయని పేర్కొన్నారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా నలుమూలల నుంచి పలువురు క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఆసక్తి గల ఆటగాళ్లు ఎంట్రీ ఫీజు రూ.300 చెల్లించి తమ పేర్లను ఈ నెల 16వ తేదీలోపు నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు టోర్నమెంట్ ఆర్గనైజర్స్ సుమన్ , 9493321836, శబరిష్ ,6304025894, నాయక్ ,7799384817 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.