ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నాయి. దీనికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. సీతారామచంద్రులవారిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు చేపట్టిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై టీటీడీ జేఈఓ వీరభద్రం సమీక్ష నిర్వహించారు. కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ- నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. బ్రహ్మోత్సవం నాటికి కల్యాణ వేదిక ప్రాంగణంలో వసతి సముదాయం వద్ద ఉన్న జలప్రసాదాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు.

కల్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ఇచ్చేలా ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ప్రస్తుతం క్యూలైన్లు, వసతి గృహాలు, సూచికలు, మంచినీటి సౌకర్యం, ఇతర ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలని సూచించింది. రథం తిరిగే మార్గాలు, ముఖ్యంగా మాడ వీధుల్లో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయడం, ఆకట్టుకునేలా కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టడం.
స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులకు వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలని, టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
బ్రహ్మోత్సవాల వాహన సేవ’లను వీక్షించేందుకు వీలుగా ఎల్.ఈ.డి స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు, హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలను నిర్వహించనున్నారు టీటీడీ. బ్రహ్మోత్సవాల వాహన సేవ ముందు హిందూ ధర్మ పరిషత్ భజన బృందాలు ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఉండాలని, అలాగే కల్యాణోత్సవం రోజున చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంగ్ల సారాంశం
మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు వొంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు, మార్చి 26న అంకురార్పణం.. వొంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జేఈవో అధికారులను ఆదేశించారు. సీతారామచంద్రులవారిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.