seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 7:55 am Digital Edition : SEEMA KIRANAM

జియోకు చుక్కలు చూపించేలా భారీ స్కెచ్! : BSNL – Vi దోస్తీ | BSNL మరియు Vi భాగస్వామ్యం: భారతదేశం అంతటా వేగవంతమైన 5G రోల్ అవుట్ కోసం టవర్లు మరియు స్పెక్ట్రమ్‌లను పంచుకోవడానికి టెలికాం దిగ్గజాలు

వ్యాపారం

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

దేశీయ టెలికాం రంగంలో త్వరలో ఒక సంచలనం నమోదు కాబోతోంది. మొబైల్ సిగ్నల్ దొరక్క, 5G సేవలు అందక ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది వినియోగదారులకు ఊరటనిచ్చేలా BSNL – వోడాఫోన్ ఐడియా (Vi) మధ్య మౌలిక సదుపాయాల భాగస్వామ్యంపై చర్చలు మొదలయ్యాయి. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ విస్తృతిని పెంచడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు తమ టవర్లు, ఫైబర్ మరియు స్పెక్ట్రమ్‌లను పంచుకోవాలని యోచిస్తున్నాయి. ఈ పరిశీలన టెలికాం శాఖ (DoT) పార్లమెంటరీ కమిటీకి ధృవీకరించబడింది.

ప్రస్తుత మార్కెట్‌లో జియో, ఎయిర్‌టెల్‌ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని తట్టుకోవడంలో BSNL, Vi కొంత వెనుకబడి ఉన్నాయి. BSNL ఇంకా 4G/5G విస్తరణలో వేగం పుంజుకోవాల్సి ఉండగా, వోడాఫోన్ ఐడియా భారీ బకాయిలు, నిధుల లేమితో సతమతమవుతోంది. ఒకరికి బలం ఉన్నచోట మరొకరికి నెట్‌వర్క్ లేకపోవడం ఇద్దరికీ మైనస్‌గా మారింది. అందుకే, ఒకరి టవర్లను మరొకరు వాడుకోవడం ద్వారా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని (Cost Cutting) నిర్ణయించుకున్నారు.

భారతదేశం అంతటా వేగవంతమైన 5G రోల్ అవుట్ కోసం టవర్లు మరియు స్పెక్ట్రమ్‌లను పంచుకోవడానికి BSNL మరియు Vi భాగస్వామ్య టెలికాం దిగ్గజాలు

ప్రభుత్వానిదే కీలక పాత్ర!

వోడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి ఇప్పటికే 49% వాటా ఉంది. అంటే పరోక్షంగా Vi కూడా ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న సంస్థ. అందుకే ఈ రెండు కంపెనీల మధ్య సమన్వయం కుదిరితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. “వనరులను వృధా చేయకుండా, ఉన్న మౌలిక సదుపాయాలను ఇద్దరూ వాడుకుంటే 5G విస్తరణ వేగవంతం అవుతుంది” అని కమిటీ స్పష్టం చేస్తూ, ఆరు నెలల్లోగా పూర్తి నివేదిక అందించింది టెలికాం శాఖను ఆదేశించింది.

సాంకేతిక ప్రయోజనాలు ఏమిటి?

నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ ఒప్పందం కుదిరితే:

  • BSNL ప్రయోజనం: Vi కి ఉన్న విస్తృతమైన టవర్ నెట్‌వర్క్‌ను వాడుకుని BSNL తన 4G, 5G సేవలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు.
  • Vi ప్రయోజనం: BSNL వద్ద ఉన్న 700 MHz వంటి విలువైన స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను 5G సేవ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
  • కస్టమర్లకు లాభం: ఏ మూలకెళ్లినా సిగ్నల్ దొరకడం (కనెక్టివిటీ) సులభం అవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నెట్‌వర్క్ సమస్యలు తీరుతాయి.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచికలు ఇది ప్రధానంగా రెండు కంపెనీల మధ్య జరిగే వాణిజ్యపరమైన ఒప్పందం. అయితే, ప్రభుత్వం పెద్దగా వాటాదారుగా ఉన్నందున ఈ ‘వ్యూహాత్మక దోస్తీ’ త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే, భారత టెలికాం మార్కెట్‌లో జియో, ఎయిర్‌టెల్‌లకు గట్టి పోటీనివ్వడం ఖాయం.

ఆంగ్ల సారాంశం

BSNL మరియు Vodafone Idea (Vi) టవర్లు, ఫైబర్ మరియు స్పెక్ట్రమ్‌లను పంచుకోవడానికి చర్చలు జరుపుతున్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం 5G విస్తరణను వేగవంతం చేయడం మరియు రెండు టెలికాం ఆపరేటర్‌ల కోసం ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Source link