Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ని కలిసిన  కర్నూలు ఎస్పీ

జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ని కలిసిన  కర్నూలు ఎస్పీ

📰 Generate e-Paper Clip

జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన  కర్నూలు ఎస్పీ

కర్నూలు క్రైమ్ ఫిబ్రవరి 14, (సీమకిరణం న్యూస్) :

ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 15 తేదిలలో అనంతపురం జిల్లా, గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సేవాఘడ్ లో వెలసిన బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడుగా కొనసాగుతున్న జాటోతు హుస్సేన్ నాయక్  అనంతపురంకు వెళుతూ శనివారం కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంకు చేరుకున్నారు. ఈ సంధర్బంగా శనివారం ఉదయం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆయనకు పూల మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు వేగవంతం, బాధితులకు చట్టపరమైన సహాయం, అవగాహన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎస్పీతో పాటు కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు, శేషయ్య పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular