seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 4:30 am Digital Edition : SEEMA KIRANAM

జమిలి, నియోజకవర్గాల పెంపు ముహూర్తం ఫిక్స్ – ఢిల్లీ మార్క్ రాజకీయం..!! | ఒకే దేశం ఒకే ఎన్నికలు లోక్‌సభ స్థానాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ రెడ్డి సంచలన విశ్లేషణ చేశారు

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

జమిలి ఎన్నికల పై స్పష్టత వచ్చింది. ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది. నియోజకవర్గాల పెంపు పైనా ఢిల్లీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు. పార్లమెంట్ సీట్లలో మహిళా రిజర్వేషన్ అమలుకు కేంద్రం సిద్దమైంది. జనగణన జరుగుతోంది. బీజేపీ మార్క్ ప్లాన్ అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో, తెలంగాణలో 2028 చివర్లో జరగాల్సిన ఎన్నికల షెడ్యూల్ మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కేంద్రం తాజా లెక్కలతో కొత్త రాజకీయం తెర మీదకు రానుంది. హోరా హోరా పోరు ఖాయంగా ఏర్పడింది. దీంతో.. వచ్చే ఎన్నికల పై పార్టీల్లో కొత్త టెన్షన్ మొదలైంది.

కేంద్రం సంచలన నిర్ణయాలకు సిద్దం అవుతోంది. కొంత కాలంగా జరగుతున్న జమిలి ఎన్నికల నిర్వహణ పైన ఒక నిర్ణయానికి వచ్చింది. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే జమిలి బిల్లును ప్రవే పెట్టేందుకు కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ మేరకు కేంద్రం నుంచి సంకేతాలు అందుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ సైతం ఇదే నిర్వహించారు. 2029లో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం అప్పుడే ఉంటాయని చెప్పారు. దీనివల్ల తాను ఐదున్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని.. తనకు ఆరు నెలలు సీఎం పదవి బోనస్‌ అని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. దీని ద్వారా తెలంగాణలో 34, ఏపీలో 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి.

revanth-reddy-made-sensational-analysis-over-one-nation-one-elections-also-on-lok-sabha-seats-re-org

బీజేపీ మార్క్ రాజకీయం

జమిలి ఎన్నికలకు సాంకేతిక అడ్డంకులు లేకపోతే… 2029లోనే జరిగేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. దీంతో, ఏపీలో ఎన్నికల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే.. లోక్ సభ నియోజక వర్గాలను సైతం పునర్విభజన కసరత్తు అందిస్తుంది. మహిళా రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. 2029 ఎన్నికలు బీజేపీ నాయకత్వానికి జీవన్మరణ సమస్య కావటంతో.. పక్కా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయాల అమలు ద్వారా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఇక.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లో పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. అదే విధంగా మహిళలకు లోక్ సభ సీట్లు ప్రత్యేకంగా రిజర్వ్ చేయవలసి ఉంటుంది. ఈ నెలలో ప్రారంభం కానున్న జనగణన పూర్తి అయిన తరువాత ఖరారు చేసే లెక్కల ఆధారంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. కేంద్రం తాజా ప్రణాళికలు.. రాజకీయ లెక్కలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

ఆంగ్ల సారాంశం

లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో 2029లో జరగనున్న ఒకే దేశం ఒకే ఎన్నికపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Source link