seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 12:21 pm Digital Edition : SEEMA KIRANAM

జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా.. ట్విస్ట్ లు! | జనగాం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా.. కిడ్నాప్, నిరసనలు, షాకింగ్ ట్విస్ట్‌లు, brs vs కాంగ్రెస్

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేక నాటకీయ పరిణామాలు, ఆందోళనల నడుమ వాయిదా పడింది. జనగామలో వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఎన్నికల అధికారి గోపిరామ్ నేతృత్వం లోనైనా పూర్తి కాంగ్రెస్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోందని యాదాద్రి భువన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ధర్నా చేశారు. 24గంటలపాటు ఎన్నికలను వాయిదా వేయాలని పో డియం ముందు వార్డు సభ్యులతో బైఠాయించారు.

కౌన్సిలర్ కిడ్నాప్.. కథలో ట్విస్ట్

28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యిందని పిర్యాదుతో నిన్న ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. కాగా ఈరోజు 28వ వార్డు మహిళా కౌన్సిలర్ మున్సిపాలిటీకి చేరుకొని బీఆర్ ఎస్ నుంచి గెలిచానని, ఓటు బీఆర్ఎస్ కి వేస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థిగా గోపగాని సుగుణాకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి కడకంచి బాలమణి పేర్లను ఆయా పార్టీల కౌన్సిలర్లు ప్రతిపాదించారు.

జనగాం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా కిడ్నాప్ నిరసనలు షాకింగ్ ట్విస్ట్‌లు brs vs కాంగ్రెస్

ఎన్నిక వాయిదా వెయ్యాలని ఎంపీ మొండిపట్టు

ఆ వెంటనే ఎక్స్ అఫీషియో సభ్యులు కిరణ్ హాజరైన యాదాద్రి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కుమార్ రెడ్డి కలుగజేసుకొని శాంతి భద్రతల సమస్య ఉన్నందున ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కోరం పూర్తిగా ఉండటంతో ఎన్నికల అధికారి, జనగామ ఆర్ డి ఓ గోపిరామ్ ఎన్నికలు ఏర్పాటు మొగ్గు చూపారు. ఎన్నికలకు సహకరించాలని ఎంపీకి ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్ కౌన్సిలర్ లతో ఆందోళన చేసిన ఎమ్మెల్యే పల్లా

ఎంపీ కిరణ్ కుమార్ 15మంది కౌన్సిలర్లతో పోడియం ఎదుట ధర్నాకు దిగారు. తిరిగి రేపు ఉదయం 11గంటలకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కోరం ఉన్నా ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని జనగామ బీఆర్ఎస్ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట కౌన్సిలర్ అభ్యర్థులతో ధర్నా నిర్వహించారు.

జనగామ చైర్మన్ జారిపోతుందేమో అన్న అనుమానం

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికను రేపటికి వాయిదా వేయాలని పట్టుబడటంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చేర్యాలలో కాంగ్రెస్ కౌన్సిలర్ బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినట్టు ఇక్కడ కూడా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ కు చైర్మన్ పోతుందేమో అన్న భయంతో ఈ ఎన్నిక ఆపాలని ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు.

ఆంగ్ల సారాంశం

నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య జనగాం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో, శాంతిభద్రతల ఆందోళనలను పేర్కొంటూ నిరసనలు చేపట్టారు, దీంతో అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు.

Source link