seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 5:12 am Digital Edition : SEEMA KIRANAM

జగన్ భద్రతా లోపాలపై విచారణ, కేంద్రం హోం శాఖకు నేరుగా..!! | జిల్లాల పర్యటనలో వైఎస్‌ జగన్‌ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు, వివరాలు ఇక్కడ ఉన్నాయి

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. జగన్ జిల్లాల పర్యటన సమయంలో సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు జగన్ భద్రత పైన కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. ఇటీవల జగన్ భద్రతలో లోపాలు కనిపించాయని..దీనిపై విచారణ చేసి… తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. జగన్ జిల్లాల పర్యటనల సమయంలో ఆందోళనలు.. చోటు చేసుకుంటున్న పరిణామాలను ఈ లేఖలో వివరించారు.

మాజీ సీఎం జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు వైసీపీ ముఖ్య నేత తలశిల రఘురాం లేక రాసారు. జగన్ జిల్లాల పర్యటనల సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. జగన్ కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే సమయంలో భద్రతాపరంగా తీవ్ర స్థాయిలో లోపాలు కనిపించాయని లేఖలో వివరించారు. ఈ లోపాల పైన విచారణ చేపట్టాలని. సాధారణంగా 22 కిలో మీటర్లు లేకుండా ఉన్న మార్గాన్ని పక్కన పెట్టి.. ఎలాంటి స్పష్టమైన కారణం 47 కిలో మీటర్ల మార్గానికి రూట్ మార్పు చేసారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది.. మీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తిరుగు ప్రయాణం రూటు మార్పు చేసారని వివరించారు.

జిల్లాల పర్యటనలో వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు వైఎస్ఆర్‌సీపీ ఫిర్యాదు

నిర్లక్ష్యం చేస్తున్నారు

జగన్ కు సూచించిన మార్గం అత్యంత రద్దీగా లేదని.. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వీవీఐపీకి ఏ మాత్రం అనుకూలం కాదని పేర్కొన్నారు. ఈ విధమైన అనూహ్య రూట్ మ్యాప్‌లు భద్రతాపరంగా ప్రోటోకాల్స్‌ను బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో వీఐపీ కి భద్రతాపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలియజేసారు. ముందస్తు భద్రతా అంచనా లేకుండా.. లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వకుండా తీసుకుంటున్న ఈ సడన్ నిర్ణయాలతో సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులో వివరించబడింది. ముందస్తు సమాచారం లేకుండా నిర్లక్ష్యంగా నిర్దేశించబడినట్లు నిర్దేశించబడింది. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని, గతం లోనూ ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారని పరిణామాలను లేఖలో వివరించారు. జగన్ భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖను లేఖలో సూచించింది.

ఆంగ్ల సారాంశం

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైఎస్‌ఆర్‌సీపీ లేఖ, తాజా పర్యటనల్లో జరిగిన వైఫల్యాన్ని వివరించింది.

Source link