seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 1:51 pm Digital Edition : SEEMA KIRANAM

జగన్ ను కలిసొచ్చాక అంబటి బిగ్ స్టేట్ మెంట్ | బెయిల్‌ తర్వాత వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు, తప్పుడు కేసులపై చట్టపరంగా పోరాడతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మాజీ మంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఈ ఉదయం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా క లిశారు. అక్రమ కేసులో అరెస్టయిన ఆయన మొన్నటివరకు రిమాండ్‌లో ఉన్నారు. రెండురోజుల కిందటే బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా తాడేపల్లి క్యాంప్ జగన్ ను కలిశారు.

ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..త’నపై పెట్టిన అక్రమ కేసుల గురించి జగన్ కు వివరించారు అంబటి రాంబాబు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి వంటి అంశాలను జగన్‌కు వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తప్పుడు కేసులపై చట్టపరంగా పోరాడుతానని హామీ ఇచ్చిన అంబటి రాంబాబు, బెయిల్ తర్వాత వైఎస్ జగన్‌ను కలిసి కీలక వ్యాఖ్యలు చేశారు.

తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొంటామని వైఎస్ జగ’న్ భరోసా ఇచ్చారు. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టినట్లు తెలుస్తోంది. ప్రజల పక్షాన, ప్రజల తరుపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుస్తామని, పార్టీ నాయకులు, క్యాడర్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

జగన్‌ను కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, లోక్‌సభ మాజీ సభ్యుడు నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఉన్నారు. బుధవారం నాడు అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది. న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ అందించింది. అంబటి రాంబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు సెషన్స్ న్యాయస్థానం జడ్జి కొట్టివేశారు.

జగన్ ను కలిసిన అనంతరం అంబటి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ మూకలు తన ఇంటిపై దాడికి వచ్చినప్పుడు పోలీసులు రక్షణ కల్పించలేక పారిపోవాలని సూచించారు. టీడీపీ నేతలు కర్రలు, రాడ్లు తీసుకుని తన కారుపై దాడికి దిగారని, అడ్డగించిన టీడీపీ శ్రేణులు బండబూతులు తిట్టారని పేర్కొన్నారు. వారు తిడుతున్నారనే ఆవేశంలో తాను స్పందించానని, తాను కూడా మాట తూలానని చెప్పారు. ఆ వ్యాఖ్యల పట్ల నేను పశ్చాత్తాపపడ్డానని, క్షమాపణలు కూడా చెప్పానని అంబటి రాంబాబు వివరించారు.

పవన్ కల్యాణ్ బలం కాపు కులమేనని, కందుకూరులో సొంత కులానికి చెందిన నాయకుడిని టీడీపీ హత్య చేసినా ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. కాపు నాయకులను టీడీపీ చంపుతున్నా వారికే కాపు కాస్తానంటే ఎవరూ చూస్తూ ఉండరని చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్ అని తేల్చి చెప్పారు అంబటి. కేసులకు భయపడి తగ్గుతాననుకుంటే పొరపాటేనని, తగ్గనే తగ్గబోననీ ఆయన స్పష్టం చేశారు.

ఆంగ్ల సారాంశం

అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై విడుదలైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆయన నివాసంలో కలిశారు.

Source link