జగన్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది : మంత్రి సత్యకుమార్
జగన్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది : మంత్రి సత్యకుమార్ ఇతరులకు జగన్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సత్యకుమార్. బీసీ రిజర్వేషన్లపై ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.