seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 6:21 pm Digital Edition : SEEMA KIRANAM

జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నాయకుల సమావేశం

జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నాయకుల సమావేశం

 

 

తాడేపల్లి, ఆగస్టు 25, (సీమకిరణం న్యూస్) : 

 

వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త దారా సుధీర్, ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి, గుంతకల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డి తదితర ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలు తదితర అంశాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య నాయకులతో చర్చించారు.