seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 6:18 pm Digital Edition : SEEMA KIRANAM

జగన్‌కు రాఖీ కట్టిన కంగాటి శ్రీదేవమ్మ

జగన్‌కు రాఖీ కట్టిన కంగాటి శ్రీదేవమ్మ

 

తాడేపల్లి, ఆగస్టు 25, (సీమకిరణం న్యూస్) : 

 

రాఖీ పౌర్ణమి సందర్భంగా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ముందస్తుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. సమావేశం అనంతరం శ్రీదేవమ్మ వైఎస్ జగన్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ చర్చించారు.