seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 4:24 pm Digital Edition : SEEMA KIRANAM

చెరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శాంతమ్మ నామినేషన్ దాఖలు

నామినేషన్ కార్యక్రమానికి హాజరైన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, కంగాటి రామ్మోహన్ రెడ్డి 

కర్నూలు ప్రతినిధి, నవంబర్ 22, (సీమకిరణం న్యూస్):

 

వెల్దుర్తి మండలంలోని చెరుకులపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శాంతమ్మ ఆదివారం వెల్దుర్తిలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, కంగాటి రామ్మోహన్ రెడ్డి, కృష్ణగిరి మాజీ ఎంపీపీ వెంకటరామిరెడ్డి తదితర నాయకులు పాల్గొని శాంతమ్మకు మద్దతుగా నిలిచారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెరుకులపాడులో రాజకీయ సందడి నెలకొంది. సర్పంచ్ ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.