భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
వాణిజ్య LPG సిలిండర్ ధర: వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా 28 పెరిగింది. పెరిగిన రేట్లు ఈ తెల్లవారు జాము నంచి అమలులోకి వచ్చాయి. వీటితో పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఎల్పీజీ, విమాన ఇంధన ధరల పెంపుతో పాటు రైల్వే, సిమ్ బైండింగ్ వంటి నిబంధనలు మారాయి.
19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. ఢిల్లీలో 28 రూపాయల మేర పెరిగింది. ఇతర నగరాల్లో దీని ధర 31 రూపాయల వరకు ధరలు పెరిగినట్లు ఓట్లు తెలిపాయి. ధరల పెంపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ఇప్పుడు రూ. 1,740.50 నుంచి రూ. 1,768.50 కు చేరింది. కోల్‌కతాలో రూ. 1,844.50 నుంచి రూ. 1,875.50, ముంబైలో 1,692.50 నుంచి రూ. 1,720.50 పెరిగింది. చెన్నైలో దీని ధర రూ. 1,929 అయ్యింది. పాత ధర రూ. 1,899.50.

ఎల్పీజీ ధరలతో పాటు నేటి నుండి విమాన ఇంధనం (ATF) ధరలు పెరిగాయి. ఇది విమాన ప్రయాణికుల ప్రయాణ ఖర్చులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రతి నెలా తొలి తేదీన ఐటీఎఫ్ ధరలను సవరించే ఆయిల్ కంపెనీలు, ఈసారి కూడా పెంపును ప్రకటించాయి. కొత్త ధరల ప్రకారం, ఢిల్లీలో ఐటీఎఫ్ కిలోలీటర్‌కు రూ. 91,393.39 నుండి రూ. 96,638.14కు పెరిగింది. కోల్‌కతా- రూ. 94,445.62 నుండి రూ. 99,587.14, ముంబై- రూ. 85,474.63 నుండి రూ. 90,451.87కు, చెన్నైలో రూ. 94,781.99 నుండి రూ. 1,00,280.49 కు చేరాయి.
గృహ వినియోగం కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ ప్రకారం.. ఢిల్లీ- రూ. 853.00, గుర్గావ్- రూ. 861.5, అహ్మదాబాద్- రూ. 860, జైపూర్- రూ. 856.5, పాట్నా- రూ. 942.5, ఆగ్రా- రూ. 865.5, మీరట్- రూ. 860, ఘజియాబాద్- రూ. 850.5, ఇండోర్- రూ. 881, భోపాల్- రూ. 858.5, లూధియానా- రూ. 880, వారణాసి- రూ. 916.50 పైసలు, లక్నో-రూ. 890.50 పైసలు, ముంబై- రూ. 852.50 పైసలు, పూణే- రూ. 856, హైదరాబాద్- రూ. 905, బెంగళూరు 855.50 పైసలు ఉంటోంది.

