భారతదేశం
ఓయ్-జక్కీ మహేష్
తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని.. ప్రజల నమ్మకమే తమకు ముఖ్యమని దళపతి విజయ్ ప్రకటించడంతో కోలీవుడ్ నుంచి కోట వరకు రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి.
సీఎం పదవి ఆఫర్.. అయినా నో చెప్పిన విజయ్!
ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం ఉన్న తరుణంలో టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున్ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. విజయ్‌కు ఓ గుర్తుతెలియని పార్టీ నుంచి ఏకంగా 90 సీట్లు, సీఎం పదవి ఆఫర్ వచ్చిందని ఆయన గుర్తించారు. “విజయ్ హోదా కోసం ఢిల్లీ ముందు తలవంచే వ్యక్తి కాదు.. మాకు ప్రజల మద్దతు చాలు” అని చెబుతూ ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ ఆఫర్ ఇచ్చింది బీజేపీయేనని విశ్లేషకులు.

పొత్తుల ప్రచారంపై విజయ్ ఫైర్
ఇటీవల ఓ ఇఫ్తార్ పార్టీలో విజయ్ మాట్లాడుతూ.. తన పార్టీ బీజేపీ లేదా ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వార్తలను తీవ్రంగా ఖండించారు. “మేము ఎవరి టీంలోనూ లేము.. కేవలం ప్రజల టీమ్‌లో మాత్రమే ఉన్నాం. మాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది” అని విజయ్ స్పష్టం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ విజయ్‌తో పొత్తు కోసం ప్రయత్నించారు.. ప్రస్తుత అధికార పార్టీ డీఎంకేకు వ్యతిరేకంగా విజయ్ తన పోరాటాన్ని సాగిస్తున్నారు.
విజయ్ ముందున్న సవాళ్లు:
విజయ్ రాజకీయ ప్రయాణం పూల బాట ఏమీ కాదు. ఆయనపై ప్రస్తుతం రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయి. 2025లో కరూర్ ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటనపై సీబీఐ విచారణ జరుగుతోంది. అలాగే ఆదాయపు పన్ను శాఖ కేసులు కూడా ఆయనను చుట్టుముట్టాయి. 27 ఏళ్ల వివాహ బంధం తర్వాత భార్య సంగీతతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉంది. సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు (ఏప్రిల్ 20న) ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. నటి త్రిషతో విజయ్ సంబంధంపై వస్తున్న పుకార్లు కూడా ఆయన రాజకీయ ఇమేజ్ను ప్రభావితం చేసేలా ఉన్నాయి.
చిరంజీవి మొదలా? పవన్ కళ్యాణ్ మొదలా?
సీనియర్ జర్నలిస్టుల విశ్లేషణ ప్రకారం.. విజయ్ ఇప్పుడు రెండు మార్గాల మధ్య ఊగిసలాడుతున్నారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ 16 శాతం ఓట్లు సాధించినా కేవలం 18 సీట్లే గెలుచుకుంది. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. విజయ్ కూడా ఒంటరిగా వెళ్తే ఓట్ల శాతం పెరిగినా సీట్లు రాకపోతే అదే పరిస్థితి ఎదురవుతుందేమోనన్న భయం.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా విజయం సాధించారు. విజయ్ కూడా బీజేపీతో చేతులు కలిపి ఈ మోడల్ పాటారా? అనేది మిలియన్ల ప్రశ్న. ప్రస్తుతానికి విజయ్ నినాదం మాత్రం “విజయ్ వర్సెస్ స్టాలిన్” అన్నట్లుగానే ఉంది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. టీవీకే పార్టీ గుర్తు ‘ఈల’. ఈ ఎన్నికల్లో విజయ్ తన ‘ఈల’తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారా లేదా ఒక సాధారణ రాజకీయ క్రీడాకారుడిగా మిగిలిపోతారా అనేది మే 4న తేలుతోంది.

