seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 1:17 pm Digital Edition : SEEMA KIRANAM

గ్రామాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు గ్రామాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

 

జిల్లా పరిషత్ హైస్కూల్లో అదనపు తరగతి గదులు ప్రారంభం

 

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల, జెండా ఆవిష్కరణ

 

బోడవాడ మందగుంట చరిత్ర పుస్తకావిష్కరణ

 

కూటమి ప్రభుత్వం చంద్రబాబు సారథ్యంలో గ్రామాలు అభివృద్ధి

 

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి

 

పర్చూరు, ఫిబ్రవరి:01,(సీమకిరణం న్యూస్) :

 

గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం పర్చూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. పర్చూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం భవిత స్కూలుకు శంకుస్థాపన చేశారు. పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రిక్షాలను అందజేశారు. బోడవాడలో జరిగిన కార్యక్రమంలో బోడవాడ మందగుంట చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ యువత భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యాచరణ సాగిస్తున్నారని ప్రశంసించారు. దాతల సహకారంతో పాఠశాలలో అదనపు గదుల నిర్మించుకోవడం శుభ పరిణామం అన్నారు. చిన్న పాఠశాలగా ప్రారంభమైన పర్చూరు జెడ్పీ హైస్కూల్ అనేకమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించింది. ఇది గ్రామానికి గర్వకారణం” అని పేర్కొన్నారు. పాఠశాలలో బెంచీలు లేని కారణంగా విద్యార్థులు కింద కూర్చొని చదువుకుంటున్నారని తన దృష్టికి వచ్చిందని, వీలైనంత త్వరగా అవసరమైన ఫర్నిచర్ అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన అందరికీ, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన ఎమ్మెల్యే ఏలూరి ఈ సందర్భంగా మాట్లాడారు.

భవిత స్కూలుకు శంకుస్థాపన…

పర్చూరు మండలం కేంద్రంలో భవిత ప్రత్యేక పాఠశాల భవన నిర్మాణానికి రూ.33.50 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే ఏలూరి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.తొలుత పర్చూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

పర్చూరును అభివృద్ధి పథం

పర్చూరు ఒక విలక్షణమైన గ్రామమని, గ్రామ రూపురేఖలు మార్చేందుకు వంద శాతం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.పర్చూరులో వంద పడకల ఆసుపత్రి నిర్మించి స్థానికుల వైద్య అవసరాలు తీర్చుతామని తెలిపారు.గుంటూరు ఛానల్ పూర్తయితే తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పారిశుద్ధ్యంపై ప్రజలు అవగాహనతో వ్యవహరించి డ్రైనేజీ సమస్యలు రాకుండా చూడాలని కోరారు.

తల్లికి వందనం ఆర్థిక భరోసాగా

తల్లికి వందనం’ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేసి, ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

ఆకట్టుకున్న విద్యార్థిని ప్రసంగం

ఈ కార్యక్రమంలో నాలుగో తరగతి విద్యార్థిని షేక్ ఆర్షియా చేసిన ఇంగ్లీష్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుల సేవలను ఆమె ఇంగ్లీష్‌లో వివరించింది. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రలో ..స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్లెల పరిశుభ్రత మనందరి బాధ్యత అంటూ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.పారిశుద్ధ్య కార్మికులకు ట్రై రిక్షా బండ్లను ఎమ్మెల్యే ఏలూరి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

రూ.13 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

బోడవాడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద 19 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.13 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య భద్రతకు సీఎం సహాయ నిధి వరంగా మారిందని అన్నారు.

బోడవాడలో అభివృద్ధి పనులు…

బోడవాడ గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రోడ్డుకు శంకుస్థాపన కూడా చేశారు.ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరణ చేశారు. తొలుత ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కు ఘన స్వాగతం పలికారు. గ్రామ చరిత్రకు సజీవ సాక్ష్యంగా* చరిత్రకు సజీవ సాక్ష్యాలైన పుస్తకాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలని ఎమ్మెల్యే అన్నారు.బోడవాడ మండలం మందగుంట గ్రామ చరిత్రను వివరించే పుస్తకాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత కాకుల సుబ్బారావు, ముఖ్య అతిథులు మాజీ రెవెన్యూ అధికారి, మేక రవీంద్రబాబు, గంట శ్రీనివాసరావు, మేక రవీంద్రబాబు, కూనంనేని బాపూజీ, సత్యనారాయణ, కోట రవి చంద్, ముప్పాళ్ళ నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజు వెంకట్రావు షేక్ శంషుద్దీన్, కోడూరు శేష బ్రహ్మచారి, సాంబశివరావు, శివనాగేశ్వరరావు, శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.