గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ మోసాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు క్రైమ్, మార్చి 11, (సీమకిరణం న్యూస్): ప్రస్తుతం చోటు చేసుకుంటున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత ను ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రజలను భయపెట్టి గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందని వెంటనే బుకింగ్ చేయాలి, ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి వంటి తప్పుడు సందేశాలు పంపిస్తూ సైబర్ మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం తెలిపారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు...