తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల లబ్దిదారులకు తీపి కబురు అందించింది. గత ప్రభుత్వ హయాంలో సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3 లక్షలు సాయం అందజేసేలా గృహలక్ష్మి పథకం శ్రీకారం చుట్టింది. 203లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో22 ఇందిరమ్మ పథకం అమలు కోసం. దీంతో, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇళ్లు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఇప్పుడు వీరికి మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సొంత ఇంటి కోసం గృహలక్ష్మి పథకం అమలు చేసింది. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షలు ఇచ్చేలా ఉంది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరమ్మ హౌసింగ్ స్కీం అమల్లోకి వచ్చింది. దీంతో, గృహలక్ష్మి లబ్దిదారులు తిరిగి ఇందిరమ్మ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాడు గృహలక్ష్మి పథకంలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్లు పెద్ద సంఖ్యలో మధ్యలోనే నిలిచిపోయాయి. అనేక మంది లబ్దిదారులు గృహలక్ష్మి పథకంలో భాగంగా నిర్మాణం ప్రారంభించిన ఇళ్లకు ఆర్దిక సాయం కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు. దీంతో.. తాజాగా ఆ ఇళ్లకు ఇందిరమ్మ వర్తింపజేస్తూ ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. తాజా నిర్ణయంతో గృహలక్ష్మి పథకం కింద నిధులు లేక నిలిచిపోయిన ఇళ్లకు ఆర్థిక సాయం అందుతుంది. సంవత్సరాలుగా లబ్దిదారుల నిరీక్షణకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో తెర పడనుంది. దీని ద్వారా మధ్యలో నిలిచిపోయిన పిల్లర్లు, పునాదులు ఇక నుంచి నివాసయోగ్యమైన గృహాలుగా మారనున్నాయి.

ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు
కాగా, ఈ నిర్ణయం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నిలిచి పోయిన గృహలక్ష్మి నిర్మాణాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని కోణాల్లో పరిశీలించి ఆ తర్వాత ఇందిరమ్మ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కాగా.. ప్రస్తుత ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల ప్రకారం ఇంటి పునాది ప్రాంతం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఉండాలని నిర్దేశించింది. అదే విధంగా గృహలక్ష్మి లబ్ధిదారుల బేస్మెంట్ తక్కువగా ఉంటే అది 400 చ.అడుగులకు తేవటానికి మరింత పునాది బీమ్‌లను వేయాల్సి ఉంటుంది. అయితే, ఇది వరకే ఆ నిర్మాణాన్ని బేస్మెంట్ తీసుకెళ్లిన దృష్ట్యా వారికి ఆ దశ డబ్బులు చెల్లించారు. మిగిలిన రూ.4 లక్షలు దశల వారిగా ఖాతాలో జమ చేస్తారు. పై కప్పు లెవల్ వరకు అయితే రూ. లక్ష, స్లాబ్ పూర్తయితే రూ. 2 లక్షలు, మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ. లక్ష చెల్లించే విధంగా ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

