భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని, మృతి చెందిన వారిని అంబులెన్స్‌లో తరలిస్తారు. అలాగే బ్రెయిన్ డెడ్ కు గురైన ఓ మహిళ కూడా ఇటీవల అంబులెన్స్ లో ఉంది. అయితే మార్గ మధ్యలో అంబులెన్స్ గుంతలో పడింది. దాంతో భారీ కుడుపులకు లోనైంది. దీనితో బ్రెయిన్ డెడ్‌గా ఆ మహిళలో చలనం వచ్చి బతికింది. ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ అంబులెన్స్ అదుపుతప్పి గుంతలో పడిన ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ ప్రాణాలతో లేచి కూర్చొంది. వివరాల్లోకి వెళితే జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న వినీతా శుక్ల అనారోగ్యానికి గురైంది. అయితే భర్త కుల్దీప్ శుక్లా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో బరేలీలోని ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు.
ఈ మేరకు బరేలీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వినీత బ్రెయిన్ డెడ్ కు గురైంది. ఈ వైద్యుడు చెప్పారు. ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. అంబులెన్స్ లో ఇంటికి తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్ అదుపు తప్పి గుంతలో పడిపోయింది. కొంత కుడుపులకు లోనైంది. దాంతో బ్రెయిన్ డెడ్ కు గురైన వినీత శరీరంలో చలనం వచ్చి లేచి కూర్చొంది. దాంతో అంతా షాక్ అయ్యారు.

వెంటనే ఆమెను ఫిలిభిత్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బ్రెయిన్ డెడ్ అయిన ఆ మహిళ అంబులెన్స్ కుడుపుల కారణంగా తిరిగి బతికినట్లు తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.