seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 11:11 am Digital Edition : SEEMA KIRANAM

గుంతకల్లు_ మార్కాపురం రైలు ఏర్పాటు గ్రీన్ సిగ్నల్

నంద్యాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త

 

నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి

 

నంద్యాల ప్రతినిధి, మే 07, (సీమకిరణం న్యూస్):

 

గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న గుంతకల్లు_ మార్కాపురం రైలు ఏర్పాటు ప్రారంభంనకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి గురువారం తెలిపారు.ఈ నెల 12 వ తేదీ మధ్యాహ్నం గుంతకల్లులో రైలు మొదలై నంద్యాలకు సాయంత్రం 4 గంటలకు వస్తుందన్నారు. ఈ ట్రైన్ గుంతకల్ లో ప్రతి రోజు సాయంత్రం బయలు దేరి నంద్యాలకు 8:30 కు చేరుకొని మార్కాపురం రోడ్డుకు రాత్రి 10:30 కు చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో మార్కాపురంలో ఉదయం 4:30 గంటలకు స్టార్ట్ అవుతుందని, నంద్యాలకు 7:30 కు చేరుకొని గుంతకల్ కు 10:30 కి చేరు కుంటుందన్నారు. గత కొద్ది కాలంగా నంద్యాల నుంచి గుంతకల్ కి పగటిపూట ఎటువంటి ట్రైన్ సౌకర్యం కూడా అందుబాటులో లేదని గమనించిన తాను భారత పార్లమెంట్ లో ప్రస్తావించానన్నారు, అందుకు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఈ ట్రైన్ ను ఏర్పాటును పరిశీలిస్తాం అని హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు ఈ నెల 12 వ తేదీ గుంతకల్లు- మార్కాపురం వరకు కొత్త రైలు నడుస్తుందని, ఈ నెల 12 వ తేదీ సాయంత్రం 4 గంటలకు నంద్యాల రైల్వే స్టేషన్ లో ప్రజల సమక్షంలో ఈ రైలును ప్రారంభిస్తున్నామని, గుంతకల్లు వైపు పగటి పూట వెళ్లే నంద్యాల జిల్లా రైలు ప్రయాణికుల మేలు జరుగుతుందని, తన విన్నపాన్ని అంగీకరించి ఈ కొత్త రైలు మంజూరు చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.