seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 10:16 pm Digital Edition : SEEMA KIRANAM

గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్త: గిరిజన గ్రామాల అభివృద్ధికి నిధులు ప్రకటించారు

[ad_1]

ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలోని గిరిజన గ్రామాలకు వరాల జల్లు కురిపించారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున నిధులను కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు . నందిగరువు లో పాఠశాల భవనం, అంగన్వాడి కేంద్రం నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే కొత్తపాలెం గ్రామం ప్రజల విజ్ఞప్తుల మేరకు గ్రామాలకు 1.6 కిలో మీటర్ల రోడ్డు నిర్మించామన్నారు.

ఆవిర్భావ దినోత్సవం గిరిజన గ్రామంలో చేసుకున్న పవన్ కళ్యాణ్

విబి జిరామ్ జి పథకం కింద గిరిజన గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పవన్ కళ్యాణ్ తెలిపారు. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి బాట పట్టారు. గిరిజన గ్రామాలలో పలు కార్యక్రమాలలో ఉన్నాయి. లగిసుపల్లి హెలిపాడ్ నుంచి ఓనూరు జంక్షన్ చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన కాలినడకన ఓనూరు గ్రామానికి చేరుకున్నారు.

గిరిజన గ్రామాల అభివృద్ధికి నిధులు ప్రకటించడం శుభవార్త అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఓనూరులో స్కూల్ బ్యాగ్ పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్

ఓనూరులో పాఠశాల విద్యార్థులకు పవన్ కళ్యాణ్ స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. జల జీవన్ మిషన్‌లో ఏర్పాటు చేసిన నీటి కుళాయి పనులను ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో ఉప ముఖ్యమంత్రి పవన్‌తో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్, కలెక్టర్ దినేష్ కుమార్ ఉన్నారు.అక్కడి నుంచి ఓనూరు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం, గర్భిణీలకు పౌష్టికాహార కిట్‌లను పంపిణీ చేశారు.

నందిగరువులో గిరిజనులతో మాటా మంతీ

ఆ తర్వాత ఓనూరు ఎంపీపీ పాఠశాలకు వెళ్లి పిల్లలతో ముచ్చటించారు. వారికి పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసి, సర్వశిక్షణ అభియాన్ అధికారి స్వామి నాయుడు నుంచి పాఠశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన నడుచుకుంటూ నందిగరువు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం ప్రజలతో ‘మాటామంతి’ కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గిరిజనుల సంక్షేమం కాంక్షించిన పవన్ కళ్యాణ్

ఈ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గిరిజనులు బాగుండాలని ఆకాంక్షించారు. మీరు బాగుండాలి..మీరు ఎవరూ కన్నీళ్లు పెట్టొద్దు..మేమంతా ఉన్నది మీకు మంచి చేయడానికే అని పేర్కొన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాలంటే భయపడతారు..కానీ నేను భయపడనన్న పవన్ కళ్యాణ్ తాను కూడా వారికి మంచే చేస్తానన్నారు.

గిరిజన గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించిన పవన్ కళ్యాణ్

తాను ఏ పార్టీ అనేది చూడనని, మీరు మాకు ఓట్లు వేసారా లేదా చూడలేదని, మీరంతా మా అన్నదమ్ములు, ఆడపడుచులు అదే చూశానన్నారు. తాను ప్రజల కోసం పనిచేసే వాడిని స్పష్టం చేశారు. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వనిధులు మళ్లింపు ఏజెన్సీ వెనుకబాటుతనానికి కారణమన్నారు. నందిగరువు గ్రామంలో గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, కొందరు అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

ఏజెన్సీలో డోలీల మోతలు కనిపించకూడదని రోడ్లు వేశాం

40 గడపలు ఉన్న నందిగరువు గ్రామానికి దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేయించాం. ఏజెన్సీలో డోలీల మోతలు కనిపించకూడదని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామానికి రోడ్లు ఏర్పాటు చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఏనాడూ మీ గ్రామానికి రాలేదని, మీ కష్టం వినలేదని, ఏనాడు మీ అభివృద్ధి ఊసు ఎత్తలేదని, గత వైసిపి పాలకులపై నిప్పులు చెరిగారు.

18 నెలల్లోనే గిరిజన గ్రామాలలో 460 కిలోమీటర్ల మేర రోడ్లు

తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గిరిజన గ్రామాలలో 460 మేర రోడ్లు వేశామన్నారు. ఈ ప్రాంతంలో అభ్యర్థులు గెలవకపోయినా ఎక్కడా కూటమి తాము వివక్ష చూపించలేదు అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా రక్షిత మంచి నీరు అందిస్తాం అన్నారు.

[ad_2]

Source link