seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 5:01 am Digital Edition : SEEMA KIRANAM

గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ నిరసన, నినాదాలు – సభలో ఆ వెంటనే..!! | అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మధ్య వైఎస్సార్సీపీ నిరసన, పార్టీ నేతల ఇళ్లపై దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు కాగానే.. వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. మాజీ సీఎం జగన్ తో సహా వైసీపీ సభ్యులు సభకు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సభ్యుల సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. నినాదాలు చేసారు. గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఆ వెంటనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అయ్యాయి. సభకు హాజరైన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం వేళ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని నినాదాలు చేసారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేసారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకొచ్చిన మార్పులు… పథకాల అమలు గురించి గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మధ్య వైఎస్సార్సీపీ పార్టీ నేతల ఇళ్లపై దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

ఆ సమయంలో వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ప్రభుత్వం సాధించిన విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అన్ని రంగాల్లో అద్భుత పాలన సాగిస్తుందని చెప్పారు. ఆ సమయంలో స్పీకర్ పోడియం చుట్టుముట్టిన వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ… నిరసనకు దిగారు. గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఆ తరువాత గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసారు. ప్రభుత్వం సాధించిన ప్రగతిని గవర్నర్ తన ప్రసంగంలో వివరిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. సమావేశాల వేళ ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించనున్నారు. సభకు వెళ్లే ఎమ్మెల్యేలు వెళ్లేందుకు జగన్ సూచించినట్లు సమాచారం. అదే విధంగా మండలిలో మాత్రం పార్టీ ఎమ్మెల్సీలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్లపై దాడులు, ఆర్దిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు.

కాగా.. గవర్నర్ ప్రసంగం అయిన తరువాత బీఏసీ సమావేశం. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి .. అజెండా ఖరారు చేయనుంది. బీఏసీకి వైసీపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల గురించి సభలో చర్చించి.. ప్రజలకు వివరించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో.. వైసీపీ హాజరు పై తీసుకునే నిర్ణయం పైన ఆసక్తి.

ఆంగ్ల సారాంశం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నిరసన.

Source link