తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలలో ఉత్కంఠత. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పలు చోట్ల విజయం సాధిస్తూ జోరు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ కు షాక్ ఇస్తున్నారు.
గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో
గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. వార్డు ఫలితాలు వెలువడుతున్నాయని బీఎస్ అభ్యర్థులు ఏకపక్ష విజయాలతో స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు. మొత్తం లెక్కింపులో 14 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు వార్డులకే పరిమితమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచినా, మున్సిపాలిటీ అధికారంపై ప్రభావం చూపే స్థాయిలో వారి సంఖ్య లేకపోవడం.

కాంగ్రెస్ కు షాక్
స్పష్టమైన మెజార్టీతో బీఆర్ఎస్ మున్సిపాలిటీపై పూర్తి పట్టు. వార్డు స్థాయి ఫలితాల్లోనే కాకుండా, మొత్తం పాలనాధికారాన్ని కైవసం చేసుకోవడం ఆ పార్టీకి కీలక విజయం సాధించింది. కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో గెలుపొందినా, మున్సిపాలిటీ అధికారం సాధించే స్థాయిలో ఫలితాలు నమోదు కాలేదు. ఈ ఫలితంతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి మున్సిపాలిటీని గెలుచుకున్న పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది.
ఈ వార్డులలో బీఆర్ఎస్ విజయం
మిగిలిన మున్సిపాలిటీల ఫలితాలపై కూడా ఈ విజయ ప్రభావం ఉండే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ 100 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదే మున్సిపాలిటీలోని 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలిచారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలోని 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గురుక కుమార్ విజయం సాధించారు.
చాలా మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలో
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇంకా చాలా మున్సిపాలిటీలు తమ ఖాతాలో పడతాయి అన్న ధీమాలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
ఆంగ్ల సారాంశం
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధిస్తూ తమ జోరును కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ కు షాక్ ఇస్తున్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీని brs గెలుచుకున్నారు, అది brs ఖాతాలో ఉంది.