seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:42 pm Digital Edition : SEEMA KIRANAM

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

 

 

2 కిలోల 172 గ్రాముల గంజాయి స్వాధీనం

 

 

కర్నూలు క్రైమ్, అక్టోబర్ 09 , (సీమకిరణం న్యూస్):

 

 

కర్నూలు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 2 కిలోల 172 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు తాలూకా సిఐ తేజ మూర్తి తెలిపారు. శుక్రవారం కర్నూలు మండలం బి. తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని టీవీ9 ప్రజా నగర్ కాలనీ శివారులో టీడ్కో హౌస్ వెనుక ఉన్న బహిరంగ ప్రదేశంలో అక్రమంగా గంజాయి కలిగి ఉన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు కర్నూలు తాలూకా సిఐ తేజ మూర్తి పేర్కొన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కర్నూలు తాలూకా సిఐ తేజ మూర్తి తెలిపారు.