seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 6:54 am Digital Edition : SEEMA KIRANAM

ఖాకీల నీడలో జూదశాల.. కీకారణ్యంలో కోట్ల దందా! | ములుగు అటవీ ప్రాంతంలో గ్యాంబ్లింగ్ మాఫియా, తెలంగాణ సరిహద్దులో కోట్ల విలువైన బెట్టింగ్ రాకెట్

తెలంగాణ

ఓయ్-జక్కీ మహేష్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

అదో దట్టమైన ప్రాంతం, రెండు రాష్ట్రాల సరిహద్ధు కీకరారణ్యం. ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే ఆటో దుకాణాల నిబంధనలున్నాయి అలాంటి నిబంధనలను తుంగలో తొక్కి వందల సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్‌లతో స్వచ్ఛమైన ప్రదేశం ప్రాంతాన్ని జూదాలకు అడ్డాగా మార్చారు. వారంలో రెండు రోజులు జరిగే ఈ జూదశాలలో కోట్ల రూపాయల దందా కొనసాగుతుంది. ప్రభుత్వ నిషేధిత ఆటల కోసమే నిర్వహించే ఈ సంతపై దాడులు చేసేందుకు అధికారులు అక్కడికి రాకుండా చూసుకుంటారు నిర్వాహకులు. అసలు ఆ ప్రాంతం ఎక్కడో.. ఆ జూదశాల నిర్వాహకులు చేసే దందా గురించి తెలుసుకుందాం.

జూదశాలగా మారిన ప్రదేశం
ములుగు జిల్లా జాతీయ రహదారి 163 తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్ధు గ్రామమైన తారలగూడ ప్రాంతంలో వారంలో రెండు రోజుల పాటు జరిగే సంతను ఓ ఇద్దరు వ్యక్తులు జూదశాలగా మార్చారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని అడ్డాగా ఎంచుకుని పరిసర ప్రాంత పోలీసు, ప్రభుత్వ శాఖ అధికారులు డబ్బులతో కమ్మేసారని సమాచారం. దీంతో పస్ర, ఏటూరునాగారం, వాజేడు, నూగురు వెంకటాపురం, పేరూరు తూర్పు జూద పందెం కోళ్లతో చేరుకునే వాహనాలను సైతం వాహనాల తనిఖీలు చేసి వదిలేస్తారని పోలీసులు తెలిపారు.

ములుగు అటవీప్రాంతంలో గ్యాంబ్లింగ్ మాఫియా తెలంగాణ సరిహద్దులో కోట్ల విలువైన బెట్టింగ్ రాకెట్

ఎంట్రీ ఫీజు రూ.1500
జూద ప్రాంతంలో కోడి పందాలు, పేకాట, కాయ్ రాజా కాయ్ ఆటలు నిర్వహిస్తూ కోట్లలో చేతులు మారతాయని సమాచారం. ఈ సంతలో అడుగు పెట్టాలంటే ఎంట్రీలోనే రూ.1500 ఫీజు తీసుకుని చేతిపై ముద్ర వేస్తారు. ఆ ముద్ర ఉన్న వాళ్లే ఆ సంతలో తిరగాలి, పందెంలో పోటి చేయాలి లేకుంటే అక్కడ నుండి గెంటేయడమే వారి నిబంధనలో సూత్రం. జూద ప్రాంతాన్ని మొత్తం ఇద్ధరు వ్యక్తులే శాశిస్తారని తెలిసింది.

కమీషన్ చెల్లించాల్సిందే..
లక్ష పందెం వేస్తే వీరి కమీషన్ పది వేయిలు చెల్లించాల్సిందే.. అలా ఒక్క రోజులో వందల మంది వస్తారు అంటే ఆ జూదశాలలో ఏ స్థాయిలో దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవాలి.భారీ సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బొలేరోలు వారం వారంలో చేరుకుని రెండు రోజుల పాటు జరిగే సంతలో పలు రకాల నిషేధిత జూదాలలో పాల్గొని, మత్తు పానీయాలు, గంజాయి ఎమ్మెల్యేలు మార్చి తూగవుతున్నారు. ప్రభుత్వ నిషేధిత, అసాంఘీక కార్యకలపాలను అడ్డుకుని.. వివిధ రకాల జూదాలకు బానిసలుగా మారి కుటుంబాలకు దూరమవుతున్న వారిని రక్షించాలని పరిసర ప్రాంత గ్రామాల ప్రజలను వేడుకుంటున్నారు.

చట్టపరంగా చర్యలు చేపట్టాలి..
ఇతర నేరాలను అరికట్టి శాంతియుత వాతావరణాన్ని నెలకొనేలా చూడాల్సిన సంబందిత అధికారులే.. కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి వ్యక్తులకు సహకరించి జూదశాల నిర్వహణకు కారకులవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. పస్ర, ఏటూరునాగారం, పేరూర్, వాజేడు, నూగురు వెంకటాపురం, మంగపేటలో పోలీసులు వాహనాల తనిఖీల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటి వాటిని అడ్డుకోవాలని కోరుతున్నారు. తారలగూడ ప్రాంతంలో జరుగుతున్న ఈ సంతపై దృష్టిసారించి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

ములుగు జిల్లా తారలగూడ అటవీ ప్రాంతంలో భారీ గ్యాంబ్లింగ్ మాఫియా నడుస్తోంది. కోడిపందాలు మరియు కార్డులపై నిర్వహించిన బెట్టింగ్‌లో అధికారిక మద్దతుతో కోట్లాది రూపాయలు ఉంటాయి.

Source link