seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 12:13 am Digital Edition : SEEMA KIRANAM

ఖమేనీ మృతికి భారత్ సంతాపం: ఎట్టకేలకు ఖమేనీకి భారత్ నివాళి..! ఎంబాసీలో ఇలా..! | భారతదేశం చివరగా అయతుల్లా అలీ ఖమేనీకి సంతాపం తెలిపింది, పుస్తకంపై సంతకం చేయడానికి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించింది

భారతదేశం

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతికి ఎట్టకేలకు భారత్ (india) సంతాపం ప్రకటించింది. గత కొద్ది రోజులుగా ఖమేనీ మృతిపై కేంద్రం వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం విమర్శలకు తావిచ్చింది. గతంలో భారత్‌తో సన్నిహిత సంబంధాలు నెరపిన నేత చనిపోతే.. అమెరికా, ఇజ్రాయెల్‌కు భయపడి నివాళులు సైతం అర్పించలేని పరిస్థితిలో ఉన్న కేంద్రంపై ఇప్పటికే విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది.

భారత్ విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ ఇవాళ ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఖమేనీ మృతికి సంతాప సందేశాలు రాస్తున్న పుస్తకంలో భారత్ తరపున నివాళులు అర్పిస్తూ సంతకాలు చేశారు. ఈ యుద్దానికి ముందు ఇరాన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న భారత్.. గతంలో అక్కడ చబహార్ పోర్టు నిర్మాణానికి వేల కోట్ల నిధులు కూడా ఖర్చు చేసింది. అలాగే గతంలో భారత్ కు చమురును కూడా డిస్కౌంట్ పై సరఫరా చేసిన చరిత్ర ఇరాన్ కు ఉంది. అయినా ఇప్పుడు ఖమేనీ మరణం తర్వాత భారత్ లో ముస్లింలు నిరసనలు తెలుపుతున్నా.. కేంద్రం స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పుస్తకంపై సంతకం చేయడానికి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించిన అయతుల్లా అలీ ఖమేనీకి భారతదేశం చివరగా సంతాపం తెలిపింది

ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఆ దేశ జెండాను సైతం సగానికి అవనతం చేశారు. నుండి దివంగత ఖమేనీకి నివాళి అర్పించారు. దీంతో పాటు భారత ప్రభుత్వ అధికారిక నివాళి సందేశాన్ని విక్రమ్ మిస్రీ స్వయంగా ఇరాన్ ఎంబాసీకి వెళ్లి రాయడంతో ఈ వివాదం ఇక్కడితో సమసిపోయింది. మరోవైపు నిన్న భారత్ లోని విశాఖకు వచ్చి తిరిగి వెళుతున్న ఇరాన్ నౌకను అమెరికా జలాంతర్గామి సాయంతో దాడి చేసి ముంచేసింది. ఇందులో దాదాపు 100 మంది ఇరాన్ నేవీ సిబ్బంది చనిపోయారు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. అయితే కేంద్రం ఇంకా స్పందించలేదు.

Source link