seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 5:52 am Digital Edition : SEEMA KIRANAM

క్రీడాకారులు స్ఫూర్తితో ఆటలు ఆడాలి : అడిషనల్ ఎస్పీ మహేష్

క్రీడాకారులు స్ఫూర్తితో ఆటలు ఆడాలి : అడిషనల్ ఎస్పీ మహేష్

 

— సిద్ధన గట్టు లో ముగిసిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు 

 

— మొదటి బహుమతి రూ. 1 లక్ష సాధించిన వెల్దుర్తి వెంకీ 11…

 

— రెండో బహుమతి రూ. 50 వేలు దక్కించుకున్న సిద్ధన గట్టు భగత్ సింగ్ 11…

 

వెల్దుర్తి, మే 18, (సీమకిరణం న్యూస్):

క్రీడాకారులు స్ఫూర్తితో ఆటలు ఆడాలని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ మహేష్ అన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సిద్ధన గట్టు గ్రామంలో శ్రీ సిద్దేశ్వర స్వామి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం తో ముగిశాయి. పోటీలలో దాదాపు 40 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ కు వెల్దుర్తి వెంకీ లెవెన్, సిద్ధన గట్టు భగత్ సింగ్ లెవెన్ జట్లు తలపడ్డాయి. వీటిలో వెల్దుర్తి వెంకీ 11 జట్టు ఆటలో తన ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి బహుమతి రూ. 1 లక్ష రూపాయలు దక్కించుకుంది. ఇక రెండో బహుమతి రూ. 50 వేలు సిద్ధన గట్టు భగత్ సింగ్ 11 జట్టు దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ ఎస్పీ మహేష్, వెల్దుర్తి సర్కిల్ సీఐ యుగంధర్, వెల్దుర్తి ఎస్ఐ నరేష్, క్రిష్ణగిరి ఎస్సై కృష్ణమూర్తి లను సిద్ధన గట్టు గ్రామపెద్దలు,టోర్నమెంట్ నిర్వాహకులు, యువత ఘనంగా స్వాగతం పలికారు.పోటీల అనంతరం అతిథులకు శాలువా పూలమాలలతో సన్మానించారు. విజేతలకు వారి చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రీడలు ఆటల పట్ల గ్రామ పెద్దలు ప్రోత్సహించాలన్నారు. ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు,యువత, టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.